Gargi Movie Review: రివ్యూ: గార్గి
నటీనటులు : సాయి పల్లవి, కాళీ వెంకట్ తదితరులు.
దర్శకత్వం : గౌతమ్ రామచంద్రన్
సమర్పణ : రానా దగ్గుబాటి
స్క్రీన్ ప్లే : గౌతమ్ రామచంద్రన్
నిర్మాత: గౌతమ్ రామచంద్రన్

కథ :
సాయిపల్లవి(గార్గి) మిడిల్ క్లాస్ అమ్మాయి. టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. గార్గి తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. అయితే సడెన్ గా ఓ రాత్రి ‘బాలిక పై హత్యాచారం’ కేసులో ‘గార్గి తండ్రి’ని పోలీసులు అరెస్ట్ చేసి సీక్రెట్ ప్లేస్ లో ఉంచుతారు. అసలు ఏమి జరుగుతుందో.. తన తండ్రిని ఎక్కడ ఉంచారో కూడా గార్గి కి చెప్పరు. తన తండ్రి కోసం గార్గి తల్లడిల్లిపోతోంది. మరోపక్క గార్గి తండ్రి పై కేసు బలంగా నమోదు అవుతుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో న్యాయం కోసం, తన తండ్రిని నిర్దోశిగా నిరూపించడం కోసం గార్గి పోలీసుల పై, సమాజం పై పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పోరాటంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. వాటిని గార్గి ఎలా ఎదుర్కొంది ? చివరకు గార్గికి న్యాయం జరిగిందా ? లేదా ?, అసలు గార్గి తండ్రి తప్పు చేశాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
Also Read: Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్.. వారిద్దరూ వేరే లోకం అట
విశ్లేషణ :
మూర్ఖపు అమాయకత్వానికి, స్వచ్ఛమైన మనస్తత్వాలకు మధ్య జరిగిన సంఘర్షణ మయం ఈ సినిమా. ఇలాంటి కథతో కూడా సినిమా చెయ్యొచ్చు అని నమ్మి ఈ చిత్రాన్ని తీసిన గౌతమ్ రామచంద్రన్ ను అభినందించాలి. ఈ కమర్షియల్ లోకంలో ఇలాంటి నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి సహజ పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీయడమే దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ సక్సెస్.

ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశం చాలా బాగుంది. అలాగే కీ రోల్ లో కనిపించిన సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆమె నటన అద్భుతం. ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. పైగా కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
సాయి పల్లవి యాక్టింగ్
కథ కథనం
మ్యూజిక
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
మెలో డ్రామా
సినిమా చూడాలా? వద్దా?
ఈ గార్గి లో ఎమోషన్స్ ను, సస్పెన్స్ ను, అలాగే సోషల్ మెసేజ్ ను చాలా బాగా హ్యాండిల్ చేశారు. సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోతుంది. మొత్తమ్మీద మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ ఛాయిస్ అవుతుంది.
రేటింగ్ 3.25 / 5
Also Read:Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ తో చరణ్ డైరెక్టర్ సినిమా.. ఎప్పుడంటే ?
Recommended Videos

[…] Also Read: Gargi Movie Review: రివ్యూ: గార్గి […]
[…] Also Read: Gargi Movie Review: రివ్యూ: గార్గి […]