Homeఅంతర్జాతీయంRupee-Rouble Trade Arrangement: అమెరికా డాలర్ శకం ముగిసిందా..? కొత్త కరెన్సీ కోసం భారత్,...

Rupee-Rouble Trade Arrangement: అమెరికా డాలర్ శకం ముగిసిందా..? కొత్త కరెన్సీ కోసం భారత్, చైనా, సౌదీ ప్రయత్నాలు?

Rupee-Rouble Trade Arrangement: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వాణిజ్యం కలిగిన వనరు ఏదంటే పెట్రో ఉత్పత్తులు. ఇది లభ్యమయ్యే దేశాల నుంచి అవసరముండే దేశాలకు నిత్యం ఎగుమతులు, దిగుమతులు సాగుతుంటాయి. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీలను డాలర్ల రూపంలో జరుగుతుంటాయి. పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసినప్పుడు డాలర్ కరెన్సీ ద్వారానే వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. అత్యధిక లిక్విడిటీ కలిగిన డాలర్ మారకం రేటు ఇతర కరెన్సీల కన్నా స్థిరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది దీనిని ఆమోదించారు. అయితే కొన్ని రోజుల కిందట చైనాకు చెందిన చమురు అమ్మకాల్లో చెల్లింపులకు యువాన్లను అంగీకరించడానికి సౌదీ అరేబియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి డాలర్ కు బదులు వేరే కరెన్సీని ఉపయోగించాలని 50 ఏళ్ల కిందటి నుంచే చర్చ సాగుతోంది. కానీ తాజాగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన యుద్ధ వాతావరణంతో మరోసారి దీని గురించి చర్చిస్తున్నారు. భవిష్యత్లో చమురు వ్యాపారంలో చైనాకు చెందిన యువాన్ కెరెన్సీ ఉపయోగించేందుకు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

Rupee-Rouble Trade Arrangement
Rupee-Rouble Trade Arrangement

1974 నుంచి పెట్రో డాలర్ ను ఉపయోగిస్తూ వస్తున్నారు. ప్రపంచ చమురు సంక్షోభం తరువాత అప్పటి సౌదీ అరెబియా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తో డాలర్ల రూపంలో ఎగుమతులు చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరెబియా తన డబ్బును అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. దీంతో చాలా దేశాలు సౌదీ అరెబియా బాటలో నడిచారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారం చేసేవారు డాలర్ల రూపంలో మారకాలు జరిపించారు. అయితే డాలర్ మారకం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసిందనే చెప్పొచ్చు. విదేశీ మారక నిల్వలతో పోలిస్తే డాలర్ నిల్వలు 60 శాతం ఎక్కువగా నిల్వలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Kodali Nani Comments On Minister Post: కొడాలి నానికి మంత్రి పదవి దక్కుతుందా? లేదా?

సౌదీ అరెబియా ఎగుమతుల్లో చైనాదే 26 శాతం. రష్యా నుంచి ప్రతి రోజు 15 లక్షల బ్యారెళ్ల చమురును చైనా దిగుమతి చేసుకుంటోంది. అటు ఇండియా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు కూడా చమురుకు పెద్ద కస్టమర్లుగానే ఉన్నారు. 2020 సంవత్సరం గణాంకాల ప్రకారం సౌదీ అరేబియా చమురు ఎగుమతులు 77 శాతం ఆసియా మార్కెట్లకు వెళుతుంది. యూరప్ కేవలం 10 శాతమే వినియోగిస్తుంది. ఇక అమెరికా తమ దేశంలో వెలికితీసే చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఆసియా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను పటిష్టంగా నిర్మించుకోవాలని చూస్తోంది.

Rupee-Rouble Trade Arrangement
saudi arabia mulls oil pricing in chinese yuan

ప్రపంచ చమురు మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయి. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం తో భౌగోళికంగా ఇది ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసిన చమురు బిల్లులను యువాన్లలో చెల్లించే ఏర్పాటు చేయాలని కొందమంది నిపుణులు అంటున్నారు. ఇది ఉపయోగకరమేనని భావిస్తున్నారు. భవిష్యత్ లో ఏర్పడే పరిస్థితులను భట్టి డాలర్ల నిషేధాలు ఏర్పడితే యూవాన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందని అంటున్నారు. ఇటీవల చైనా కరెన్సీ గురించి వార్తలు వచ్చినా.. ముందు ముందు ఇదే జరుగుతుందని కొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా సౌదీ అరేబియా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Also Read: Russia Ukraine Crisis 2022: ర‌ష్యాకు షాక్.. నాటో ద‌ళాల‌కు అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన అమెరికా

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular