సగటు అమ్మాయి జీవితంలో పాతికేళ్లోపే వివాహం జరిగిపోతుంది.. లేదంటే పేరెంట్స్ మదనపడిపోతుంటారు. ఇక, సినీ తారల విషయానికి వస్తే ఈ సమయం కాస్త పెరిగిపోతుంది. ఆ పెళ్లి ముచ్చట తీరే సరికి ఒంటి మీదికి ముప్పైయ్యో.. ముప్పై ఐదో వచ్చిపడతాయి! కానీ.. ఏదో ఒక దశలో మ్యారేజ్ మాత్రం కంపల్సరీగా అయిపోతుంది. కానీ.. తాను మాత్రం నుదుట బాసికం కట్టేది లేదు.. పెళ్లి పీటలు ఎక్కేది లేదు.. అసలే పెళ్లే చేసుకునేది లేదు అంటోంది సాయి పల్లవి!
Also Read: సమంత డ్రెస్ ధరెంతో తెలిస్తే.. అవాక్కవాల్సిందే..
డ్యాన్సర్ కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్ గా తన టాలెంట్ చూపిస్తూ దూసుకెళ్తోంది సాయి పల్లవి. డబ్బు తనకు ముఖ్యం కాదు.. మనసును సంతృప్తి పరిచే పాత్రలే చేస్తానంటూ ఆచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటోంది. ఆ మధ్య దాదాపు రెండు కోట్ల రూపాయల అడ్వర్టైజ్ మెంట్ ఆఫర్ వస్తే.. అవసరం లేదని సింపుల్ చెప్పేసిందీ బ్యూటీ. నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనంటూ మొహం మీదే చెప్పేసిందట ఈ రౌడీ బేబీ.
అయితే.. ఇప్పుడు తాను ఫిదా సినిమాలోనే కాదు నిజ జీవితంలో సింగిల్ పీస్ నే అంటోంది. తనకు లైఫ్ లో పెళ్లి ఆలోచనే లేదంటూ.. తన లాంటి అమ్మాయి ఎక్కడా ఉండదని రియల్ లైఫ్ లోనూ ప్రకటించుకుంటోందీ నేచురల్ బ్యూటీ. అయితే. ఈ నిర్ణయం వెనుక కారణమేంటని ఆరాతీస్తే.. తల్లిదండ్రులను చూపిస్తోందీ అమ్మడు. తన తల్లిదండ్రులను వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా లేనని చెబుతోంది. ఫిదా సినిమాలో కూడా సాయి పల్లవి ఇదే తరహా క్యారెక్టర్ ను పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. నిజ జీవితంలోనూ కన్యగానే ఉండిపోతానని చెబుతోంది పల్లవి.
ప్రస్తుతం సాయిపల్లవి కెరీర్ మంచి రేంజ్ లో ఉంది. రానా విరాట పర్వం సినిమాతోపాటు నాగ చైతన్య లవ్ స్టోరీలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఇవి కాకుండా.. తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేస్తుందీ అమ్మడు.
Also Read: రకుల్ పై రాశీ ఖన్నా జెలసీ !
అయితే.. కాలేజీ రోజుల్లో సాయిపల్లవి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ విషయంపై సాయి పల్లవి కూడా ఓపెన్ అయింది. అయితే.. ఆ తర్వాత ఏమైందోగానీ.. ఫుల్ కాన్సన్ ట్రేషన్ చదవు మీదనే పెట్టి ఎంబిబిఎస్ పూర్తిచేసింది. ఆ తర్వాత డ్యాన్సులు, సినిమాలు అంటూ కెరీర్ మార్చుకుంది. అయితే.. ఇప్పుడు పెళ్లి వద్దని చెబుతున్న బ్యూటీ తల్లిదండ్రుల కోసమే అని చెప్తోంది. నిజంగా వారే కారణమా..? లేక విఫలమైన ప్రేమ కారణమా..? అనే చర్చ సాగుతోంది.
అయితే.. ఫైనల్ గా మాత్రం తనతోపాటు తల్లిదండ్రులను చూసుకునే మగాడు వస్తే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెబుతోంది. అంటే.. అచ్చం ఫిదాలో వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి కావాలన్నమాట. మరి, ఏం జరుగుతుంది? భవిష్యత్ లో పెళ్లి విషయంలో సాయిపల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్