Revanth Reddy : రేవంత్ రెడ్డి నిన్న చేవెళ్లలో ఓ సభలో మాట్లాడాడు. అంటే రెండు గ్యారెంటీల పథకాలను ప్రారంభిస్తూ మాట్లాడాడు. ఒకటి మహాలక్ష్మీ.. రెండు గృహజ్యోతి. ఆరు గ్యారెంటీల్లో ఇవి రెండు పథకాలు అనేకన్నా.. ఒక గ్యారెంటీలో ఒకటి.. ఇంకొక గ్యారెంటీ అని చెప్పొచ్చు.
సభ ప్రభుత్వ కార్యక్రమం అయినా రాజకీయాలు మాట్లాడాడు. ముఖ్యమంత్రి అన్న సంగతి మరిచిపోయి.. తెలుగు రాష్ట్రానికి ప్రతినిధిలా మాట్లాడలేదు. గుజరాత్ మోడల్ ను మేం చేయము అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడాడు.
మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలు చూస్తే.. మహాలక్ష్మీలో మూడు కేటగిరీలున్నాయి.. అన్నింటికంటే ముఖ్యమైనది.. ప్రతీ మహిళకు 2500 ఇవ్వడం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది అసంపూర్తి. గృహజ్యోతి పథకం కింద రూ.500 కే గ్యాస్ సిలిండర్ అంటూ పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూమా మాట్లాడుతున్నారు..
రేవంత్ రెడ్డి గారూ, మరో కేసీఆర్ లాగా మాట్లాడొద్దు.. రేవంత్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.