Virat Kohli: టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఉంటున్నారు. ఓ హోటల్ లో రూములు తీసుకుని ప్రపంచ కప్ లో పాల్గొంటున్నాడు. కానీ అతడికి ప్రైవసీ లేకుండా పోతోంది. కొందరు అతడి రూంలోకి దొంగతనంగా చొరబడి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. బ్యాట్స్ మెన్ కు వ్యక్తిగత జీవితం ఉండదా? వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలు తీసుకుంటే దానికి ఎవరు కూడా ఆక్షేపించకపోవడం విడ్డూరం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి కూడా సోషల్ మీడియా వేదికగా తన అక్కసు వెళ్లగక్కాడు. హోటల్ లోని తన రూంకు రావడమే తప్పు అనుకుంటే వచ్చి యథేచ్ఛగా ఫొటోలు తీయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు.

సామాన్యుడికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఓ సెలబ్రిటీ రూంను ఇలా వీడియోలు తీసి ప్రసార మాధ్యమాల్లో ఉంచడం ఎంతవరకు సమంజసం. ప్రతి వారిలో అభిమానం ఉంటుంది. దాన్ని వ్యక్తం చేయడం కూడా వారి స్వేచ్ఛలో భాగమే. కానీ ఇలా ప్రైవసీకి భంగం కలిగేలా రూంను వీడియో తీసి ప్రచారం చేయడం దేని కిందకు వస్తుందో తెలియడం లేదు. అభిమానులు ఆటగాళ్లకు అవసరమే. వారి ప్రోద్బలంతోనే క్రీడాకారులు ప్రేమగా చూసుకోవడం కామనే. వారు మాత్రం ఇలా బరితెగించి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా చేయడం సంతృప్తికరం కాదు.
వీడియో చూస్తే విరాట్ కు ఆగ్రహం వచ్చింది. అభిమానుల తీరుపై మూర్ఖమైన అభిమానంగా చెబుతున్నారు. ఇది కచ్చితంగా గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. అభిమానం వెర్రితలలు వేస్తే ఇలాగే ఉంటుంది. ఆటగాళ్లను ఆటబొమ్మలుగా చూస్తే సహించం. వారికి గౌరవం ఇవ్వడం కూడా ఒక చర్యగానే భావించుకోవాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ప్రతి వారికి ప్రైవసీ ఉంటుంది. దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు.

ఆస్ట్రేలియా చర్యపై విరాట్ భార్య అనుష్క శర్మ కూడా స్పందించింది. ఓ వ్యక్తి అకారణంగా విరాట్ రూంలోకి ప్రవేశించి వీడియో తీయడం సరైన చర్య కాదు. ఇది పిచ్చి పని. ఆదివారం పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కొనసాగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ రూం వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ ఆటగాళ్లకే ప్రైవసీ లేకపోతే ఇక సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుందని ప్రశ్నిస్తున్నాడు. తన ప్రైవసీకి భంగం కలిగించిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.