Viral: ఇటీవల ఒక వింత జరిగింది. నెటిజన్స్ అంతా ముక్కు మీద వేలు వేసుకొని దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఇది సాధ్యమేనా, కలికాలం అంతమైందా లేక మొదలైయ్యిందా అని అర్థం కాక కిందా మీద పడుతున్నారు. డిజిటాల్ ప్లాట్ ఫార్మ్స్, ట్విటర్ అకౌంట్స్ ఈ వార్తతో మార్మోగిపోతున్నాయి. గగ్గోలెత్తుతున్నాయి. తెలుగులో చెప్పుకొని, మనం కూడా ఆ అనుభూతులను పొందుదాం.

విషయం ఏమిటంటే అర్నాబ్ గోస్వామి నిన్న తన ప్రైమ్ షోలో ఒక వక్తను నిమిషం పాటు మాట్లాడనిచ్చాడు!!!
ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన ఈ విషయం ఎలా ప్రారంభం అయ్యిందంటే -అర్నాబ్ తన షో కి అంతర్జాతీయ వక్తలను పిలిచాడు. పోర్చుగల్ సిటీ లిస్బాన్ నుండి (ఆన్ లైన్) గిల్బర్ట్ డాక్టరో అనే ఆయన కూడా వచ్చాడు. మన స్వాముల వారు యధాప్రకారం ఎవరినీ మాట్లాడనీయకుండా రంకెలు వేసిన తరువాత – ఈ గిల్బర్ట్ గారి వంతు వచ్చింది.
Also Read: AP Cabinet Expansion: కొడాలి నానిని కొనసాగిస్తారా? మంత్రి పదవి ఉంటుందా? అడ్డంకులివే
ఆయన కూల్ గా ‘నువ్వు ఇక్కడ ఒక కంగారూ కోర్టును స్థాపిస్తున్నావు. నువ్వే మొదలు పెడతావు. నువ్వే మాట్లాడుతావు. నిన్ను ఒకటి అడుగుతాను. మోడరేటర్ గా నీ భాషను పెంచకూడదు. నువ్వు ఉద్రేకంతో , ఉద్వేగభరితంగా మాట్లాడుతున్నావు. చైనా వక్తను మాట్లాడకుండా దుర్మార్గంగా ఆపేసావు. మేధావులు చర్చించేటపుడు ఈ పద్దతి సరికాదు. అలీన దేశాలకు ఈ ప్రపంచంలో ఉన్న ఇద్దరు నాయకుల్లో ఒకటైన భారత దేశంలో ఎడిటోరియల్ స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వే న్యాయాన్ని నిర్దేశిస్తున్నట్లుగా ఉండటం నన్ను షాక్ కు గురి చేశాయి’ అన్నాడు.
అంతేనా!
‘పుతిన్ గెలిస్తే లాభం పొందే దేశాలు మీ భారతదేశం, చైనాలే. కాబట్టి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు నీ దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయి’ అని కూడా అన్నాడు.
Also Read: RRR Movie NTR Fans: తగ్గేదే లే అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి చరణ్ పరిస్థితేమిటి ?
అంటే నువ్వు యాంటీ నేషనలిస్టువి అని ముఖం మీద గుద్ది మరీ చెప్పాడు.
పాఠం: అర్నబ్ నోరు మూసుకోవాలంటే యుద్ధం రావాలి. ఆయన షోలో అంతర్జాతీయ వక్తలు పాల్గొవాలి.
-రమాసుందరి