Jio Bharat 4G Phone : దేశంలో రిలయన్స్ జియో రాకముందు ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ల రాజ్యం నడిచేది. అప్పుడు 3జీ 1 జీబీ డేటానే 350 రూపాయల వరకూ ఉండేది. చాలా తక్కువ జీబీని అందరూ వాడేది. ఎక్స్ ట్రా జీబీ కావాలంటే మళ్లీ డబ్బులు పెట్టి కొనాల్సిందే. ఇక కాల్స్ కోసం టాప్ అప్ లు వేసుకొని మాట్లాడేవాళ్లం.. 100, 200 ఇలా రీచార్జ్ చేసుకునేవాళ్లం అందుకే నాడు ఇంటర్నెట్ అంటే బడాబాబులకే, పెద్దింటి వారికే అని అందరూ 2జీ ఫోన్లనే వాడేవారు.
కానీ ఒకడొచ్చాడు. ఆయనే అంబానీ.. జియోతో టెలికాం మార్కెట్ ను షేక్ చేశాడు. 4జీ నెట్ వర్క్ ను లాంచ్ చేసేసి అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఇచ్చారు. అలాగే 4జీ ఫోన్లను 4వేల లోపు రూపొందించి వదిలాడు. దీంతో ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ తెగ వాడేసి సినిమాలు, క్రికెట్ అసహా అన్ని చూసుకొని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అందరూ ఈ 4జీకి అలవాటు పడిపోయి అంతా మారిపోతున్నారు. అంబానీకి కాసులు కురిపిస్తున్నాయి. అయినా 25 కోట్ల మంది దేశంలో 2జీనే వాడుతున్నారు. వాళ్లను టార్గెట్ చేసి 4జీలోకి మార్చేలా అంబానీ ఎత్తుగడ వేశాడు. 999కే 4జీ ఫోన్ ను లాంచ్ చేసి దేశంలో మరో విప్లవం సృష్టించాడు.
దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో సరికొత్త ఒరవడికి జియో శ్రీకారం చుట్టింది. మార్కెట్లోకి జీయో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 250 మిలియన్ల మంది 2జి ఫోన్లు వినియోగిస్తున్నారు. అయితే భారతదేశంలో 5జి వినియోగించే ఈ సంఖ్యను పెంచడం లక్ష్యంగా రిలయన్స్ సంస్థ పనిచేస్తుందని గతంలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే చర్యలను చేపట్టారు ముఖేష్ అంబానీ. అందులో భాగంగానే రిలయన్స్ సంస్థ నుంచి 5జి ఫోను లాంచ్ చేశారు. మార్కెట్లో అతి తక్కువ ధరకు ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. జియో భారత్ పేరిట 4జి ఫోన్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.999 గా రిలయన్స్ సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 2జి వినియోగదారులను 4జికి మార్చే లక్ష్యంతో జియో భారత్ పేరుతో ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. ఇందులో 4జి నెట్వర్క్, అపరిమితమైన కాల్స్, యూపీఐ పేమెంట్స్ వంటి వంటి ఫీచర్స్ అందిస్తున్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి పది లక్షల మందితో జియో భారత్ బీటా ట్రైల్స్ నిర్వహిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వినియోగాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ వెల్లడించారు. దేశంలో ఇప్పటికీ 25 కోట్ల మంది 2జి మొబైల్స్ వాడుతుండగా.. వీరందరినీ 4జి వైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా జియో సంస్థ పని చేస్తోందని ఆకాష్ అంబానీ వెల్లడించారు. అందులో భాగంగానే తాజా 4జి ఫోన్ ను జియో సంస్థ లాంచ్ చేసింది. ఈ మొబైల్ కు నెలకు రూ.123 రూపాయల రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 14 జిబి డేటా లభిస్తుంది.
అదరహో అనిపిస్తున్న ఫీచర్స్..
జియో సంస్థ మార్కెట్లోకి సరికొత్తగా తీసుకువచ్చిన ఈ ఫోన్ ఫీచర్స్ కూడా అదరహో అనిపిస్తున్నాయి. ఇది కార్బన్ కంపెనీ తయారుచేసిన ఫోన్. రెండు రంగుల్లో దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో ఒకటి పాయింట్ 77 అంగుళాల క్యూవిజిఎ డిస్ ప్లే ఉంది. 1000 ఏంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. జియో సిమ్ లాక్ అయి ఉంటుంది. ఇందులో జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ కూడా ఫ్రీగా ఇన్ స్టాల్ చేసి వస్తాయి. యూపీఐ పేమెంట్ స్కూల్ అనుగుణంగా జియో పే యాప్ ను ఇందులో అందిస్తున్నారు. అలాగే టార్చ్, ఎఫ్ఎం, రేడియో, 3.5 ఎంఎం జాక్, 0.3 ఎంపీ కెమెరా వంటివి అందిస్తున్నారు. డివైస్ స్టోరేజీని ఎస్డి కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.