Reliance Jio 999 phone : రిలయన్స్ జియో అత్యంత చవక ధరలో కేవలం ₹999 విలువైన ఇంటర్నెట్-ఎనేబుల్డ్ 4G మొబైల్ ఫోన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించింది. తన ‘2G-ముక్త్ భారత్’ను దృష్టిలో భాగంగా ఇప్పటికీ 2G టెక్నాలజీతో ఉన్న 250 మిలియన్ల మొబైల్ వినియోగదారులను 4జీలోకి మార్చడానికి Jio Bharat V2 4జీ ఫోన్‌లను ప్రవేశపెడుతున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇతర మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల ఫీచర్ ఫోన్ ఆఫర్‌లతో పోలిస్తే జియో భారత్ ఫోన్‌లో 30 శాతం తక్కువ ప్లాన్ , ఏడు రెట్లు ఎక్కువ డేటా ఉందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
-జియో భారత్ ప్లాన్‌ల ధర
అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్ (28 రోజులు) – ₹123
14 GB -(0.5 GB/DAY)
వార్షిక సంవత్సర రుసుం – ₹1,234
168 GB – (0.5 GB/DAY)
-జియో 4జీ ఫోన్ వివరాలు
-ఇది కార్బన్ కంపెనీ తయారు చేసిన 4జీ ఫోన్
-స్మార్ట్ ఫోన్ లా తెర ఉండదు.. చిన్నగా 1.77 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే ఉంటుంది.
-1000 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది.
-జియో సిమ్ మాత్రమే లాక్ అయ్యి ఉంటుంది.
-జియో సినిమా, జియో సావన్ ఫ్రీ
-యూపీఐ పేమెంట్స్ కోసం జియో పే యాప్
-టార్చ్, ఎఫ్ఎం రేడియో,
-0.3 ఎంపీ కెమెరా, 3.5 ఎంఎం జాక్
– ఫోన్ స్టోరేజీని ఎస్.డీ కార్డ్ తో 128 జీబీ పెంచుకోవచ్చు.
-జియో సెంటర్లు, అన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ ను విక్రయిస్తారు.
“భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు 2G నెట్ వర్క్ తోనే చిన్న ఫోన్లు వాడుతూ టెక్నాలజీకి దూరంగా ఉన్నారు. ప్రపంచం 5G విప్లవంతో శిఖరాగ్రంలో ఉన్న సమయంలో ఇంటర్నెట్ యొక్క ప్రాథమిక లక్షణాలను మనం అందరికీ పంచాలి. అందుకే 2జీని లేకుండా అందరినీ అప్డేట్ చేయాలి” అని రిలయన్స్ జియో చైర్‌పర్సన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు.
“6 సంవత్సరాల క్రితం జియో ప్రారంభించబడినప్పుడు ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి.. ప్రతీ భారతీయుడికి సాంకేతికత యొక్క ప్రయోజనాలను అందించడానికి జియో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదని మేము స్పష్టం చేసాం. ఎంపిక చేసిన కొంతమందికి సాంకేతికత ఇకపై ప్రత్యేక హక్కుగా మిగిలిపోదు” అని అంబానీ తెలిపారు.
కంపెనీ జూలై 7 నుండి మొదటి మిలియన్ జియో భారత్ ఫోన్‌ల కోసం బీటా ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. భారతదేశంలోని 6,500 ప్రాంతాల్లో ఈ ట్రయల్ నిర్వహించబడుతుంది. లక్షలాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాట్‌ఫారమ్ , ప్రక్రియల స్కేలబిలిటీని నిర్ధారిస్తున్నామని కంపెనీ తెలిపింది.