Telangana : తెలంగాణలో కాంగ్రెస్ వెనక రెడ్డి సామాజిక సమీకరణ జరుగుతుంది

ఇక తెలంగాణలో ఒకే ఒక్క ఆశాకిరణం బీజేపీ. ఎంత ఎత్తుకు బీజేపీ ఎదిగిందో ఇప్పుడు ఘోర తప్పిదాల వల్ల బీజేపీ ప్రభ పడిపోయింది. బండి సంజయ్ వైదొలగడంతో బీజేపీ పతనం ప్రారంభమైంది.

Written By: NARESH, Updated On : September 26, 2023 2:32 pm

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఎవ్వరు ఔనన్నా కాదన్నా.. కులం భారతీయ సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ చారిత్రక కారణాల వల్ల తెలంగాణలో కులం పాత్ర అంతగా లేదు. నిజాం వ్యతిరేక పోరాటం.. మావోయిస్టు ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు చేసిన తెలంగాణ సమాజంలో కులం పెద్దగా ప్రాధాన్యత ఏర్పడలేదు.

కానీ ఇవన్నీ గత చరిత్ర. తెలంగాణ రాష్ట్రం అంశం ఇప్పుడు పక్కకుపోయింది. ఈసారి కొత్త అంశాలు ప్రజల ముందుకు వస్తోంది. ఎప్పుడూ లేనిది బీసీల్లో సామాజిక చైతన్యం పెరిగింది. తెలంగాణలో దాదాపు 75-80 శాతం వెనుకబడిన వర్గాలే. వారికి రాజ్యాధికారం లేదన్నది వారి వర్గాల్లో బలంగా పెనవేసుకుపోయింది.

ఉమ్మడి ఆంధ్రలో రెడ్డి, కమ్మ డ్యామినేషన్.. ఇప్పుడు తెలంగాణలో వెలమ, రెడ్డిల ఆధిపత్యాన్ని తెలంగాణ కులాల నేతలు సహించలేకపోతున్నారు. తెలంగాణ కేబినెట్ లో దళితులు, మహిళలు, బీసీలకు అస్సలు మంత్రి పదవులు దక్కలేదు. అగ్రకులాలకే పెద్దపీట దక్కుతోంది.

ఇన్నాళ్లు పట్టించుకోని తెలంగాణ ప్రజలు.. ఇప్పుడు దీన్ని ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ఇలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి డ్యామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. రెడ్లనే సీఎం చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ లోని బీసీలు ఇటీవల సమావేశమై గళమెత్తుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో అస్సలు బీసీలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

ఇక తెలంగాణలో ఒకే ఒక్క ఆశాకిరణం బీజేపీ. ఎంత ఎత్తుకు బీజేపీ ఎదిగిందో ఇప్పుడు ఘోర తప్పిదాల వల్ల బీజేపీ ప్రభ పడిపోయింది. బండి సంజయ్ వైదొలగడంతో బీజేపీ పతనం ప్రారంభమైంది.

తెలంగాణలో కాంగ్రెస్ వెనక రెడ్డి సామాజిక సమీకరణ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.