Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: సుధీర్ జబర్దస్త్ వదిలేయడానికి సినిమాలే కారణమా ? మరి పక్క ఛానెల్స్ లో...

Sudigali Sudheer: సుధీర్ జబర్దస్త్ వదిలేయడానికి సినిమాలే కారణమా ? మరి పక్క ఛానెల్స్ లో ఎందుకు చేస్తున్నాడు

Sudigali Sudheer: కళలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చూపించేందుకు సరైన వేదిక సినిమా పరిశ్రమ. ఇలాంటి ప్రతి ఒక్కరూ సినిమాల్లో నటించడానికే వస్తారు. కానీ అందరికీ అవకాశాలు రాకపోవచ్చు. ఈ క్రమంలో బుల్లితెరపై వైపు వెళ్తారు. అయితే అక్కడా సక్సెస్ అయిన వారు కొందరే. జబర్దస్త్ అనే ప్రొగ్రాం.. టీవీ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించింది. ఈ షో ద్వారా ఎందరో నటులు తమ ప్రతిభను ప్రదర్శించారు. సినిమాల్లో మాత్రమే కనిపించే కామెడీని ఈ షో ద్వారా ప్రసారం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇలా కామెడీ షోలు చేసి సక్సెస్ అయిన వారు కొందరు సినిమాల్లోకి వెళ్లారు. మరికొందరు ఇందులోనే కొనసాగుతున్నారు. వీరిలో ప్రముఖంగా సుడిగాలి సుధీర్ గురించి చెప్పుకోవచ్చు.

Sudigali Sudheer
Sudigali Sudheer

జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం స్కిట్ వస్తుందంటే యూత్ లో ఎనలేని క్రేజ్. గెటప్ శీను, ఆటోరాంప్రసాద్ లతో ఆయన చేసే స్కిట్ లకు కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇక రష్మీ, ఇతర వాళ్లతో సుధీర్ చేసే రొమాన్స్ కు యూత్ ఫిదా అవుతారు. మిగతా వారితో పోటీ పడుతూ టాప్ ప్లేసులో కొనసాగారు సుధీర్ టీం. అయితే జబర్దస్త్ టీంలో ప్రస్తుతం సుధీర్ కొనసాగడం లేదు. ఆయన లేకపోవడంతో టీం బోసీ పోతోంది. ఇటీవల ఆటోరాంప్రసాద్ తన స్నేహితులు సుధీర్, శ్రీను లేకపోవడంతో వెలితిగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మీలు సైతం సుధీర్ జబర్దస్త్ లో లేకపోవడం లోటుగానే ఉందని ఆవేదన చెందారు.

Also Read: IPL Success: ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీగ్ గా ఐపీఎల్ ఎందుకైంది?

అయితే బబర్దస్త్ నుంచి విడిపోయే ముందు సుధీర్ విషయంలో మేనేజ్ మెంట్ కొంచె కర్కటంగానే ప్రవర్తించిందన్న ప్రచారం టీవీ సర్కిల్స్ లో సాగుతోంది. జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వెళ్లిన సుధీర్ కు ఆ విభాగంలో ఉండడం ఇష్టం లేదట. తనను జబర్దస్త్ కు మార్చాలని సుధీర్ మేనేజ్మెంట్ ను కోరాడట. అయితే అందుకు మేనేజ్ మెంట్ ఒప్పుుకోలేదని చెప్పుకుంటున్నారు.. దీంతో తాను ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేయలేనని సుధీర్ ఆ షో ను విడిపెట్టారని కొందరు అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్రచారం అయితే సాగుతోంది.

Sudigali Sudheer
Sudigali Sudheer

మరోవైపు సినిమాల్లో అవకాశాలు రావడంతోనే సుధీర్ టీవీ షోను వదులుకున్నాడని మరికొందరు అంటున్నారు. గతంలో జబర్దస్త్ లో చేస్తూనే సాఫ్ట్ వేర్ సుధీర్ సహా తదితర సినిమాలను హీరోగా సుధీర్ చేశాడు. అయితే ఎక్కువగా కామెడీ షోకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. సినిమాల్లో సైడ్ రోల్స్ చేసినా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు సీరియస్ గా సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడట. ఇంతకాలం సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసిన ఆయనకు కామెడీ షో లో ఉండడం వల్ల కొందరు నిర్మాతలు పట్టించుకోవడం లేదట.. అందుకే ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి సినిమాలపైనే దృష్టిపెట్టాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

కానీ సినిమాల కోసమే సుధీర్ జబర్దస్త్ ను వీడాడని ప్రచారం సాగుతున్నా.. సుదీర్ మరో టీవీ షోల్లో అలరిస్తున్నాడు. అయితే సినిమాలకు జబర్ధస్త్ సహా ఈటీవీ టీవీ షో లు అడ్డంకిగా మారినప్పుడు ఇతర టీవీ షో ల్లో సుధీర్ ఎందుకు కనిపిసస్తున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జబర్దస్త్ మేనేజ్ మెంట్ తోనే విభేధాలు ఏర్పడిన కారణంగానే ఆయన షో ను వదిలినినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఉన్న జబర్దస్త్ టీం ల నంచి చాలా మంది ఒక్కొక్కరు బయటకి వచ్చారు. నాగబాబు నుంచి మొదలుకొని మనో వరకు అందరూ షో ను వదిలేశారు. ఇప్పుడు సుధీర్ కూడా ఈ షో నుంచి తప్పుకున్నారు. అయితే సుధీర్ షో ను వదలడానికి మల్లెమాలతో వచ్చిన విభేదాలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నిజనిజాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read:Deepika Padukone : ప్రభాస్ సినిమా షూటింగ్ లో దీపికా పదుకొణేకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. నిజం ఏంటేంటే?
సుధీర్ జబర్దస్త్ వదిలేయడానికి కారణం మేనేజ్మెంటా..|| Reason Behind Sudheer Leaving Jabardasth

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version