https://oktelugu.com/

RC 17 : రంగస్థలం కాంబో రిపీట్… ఆర్సీ 17పై క్రేజీ అప్డేట్!

ఆగస్టు 15న విడుదల కానుంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారట. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి ఆర్సీ 17 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 / 05:55 PM IST

    RC 17 Rangasthalam Combo Repeat... Ramcharan-Sukumar Movie,

    Follow us on

    RC 17 : 2018లో విడుదలైన రంగస్థలం బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ కి అపురూపమైన విజయం కట్టబెట్టింది ఆ చిత్రం. రామ్ చరణ్ లోని నటుడిని సుకుమార్ బయటకు తీశాడని చెప్పొచ్చు. సుకుమార్ తన గత చిత్రాలకు భిన్నంగా పీరియాడిక్ విలేజ్ రివేంజ్ డ్రామా తెరకెక్కించాడు. పలు టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది రంగస్థలం. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. రామ్ చరణ్ 17వ చిత్రం పై నేడు ప్రకటన వచ్చింది. ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. నేడు చిత్ర నిర్మాతలు సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు.

    రంగస్థలం నిర్మాతలుగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ సైతం నిర్మాణ బాగస్వామ్యం తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. అలాగే రంగస్థలం చిత్రానికి అద్భుతమైన సాంగ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. మొత్తంగా రంగస్థలం టీమ్ మరోసారి ఏకమయ్యారు. ప్రకటనతోనే చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.

    అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం ఉంది. రామ్ చరణ్-సుకుమార్ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ చేస్తున్నారు. పొలిటికల్ కరప్షన్ పై పోరాడే ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని సమాచారం. అలాగే త్వరలో ఆర్సీ 16 పట్టాలెక్కనుంది. దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ చిత్ర దర్శకుడు.

    జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్సీ 16 ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా అని తెలుస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఇక సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కానుంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారట. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి ఆర్సీ 17 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.