Vijay Devarakonda-Rashmika Romance : విజయ్ దేవరకొండతో రష్మిక మందాన ఎఫైర్ నడుపుతున్నారని గత రెండేళ్లుగా ప్రచారం అవుతుంది. ఈ వాదనను విజయ్, రష్మిక ఖండిస్తున్నారు. వారు ఎంత బుకాయించినా ఉన్న నిజం దాగదు కదా. తాజా వీడియోతో మరోసారి వారిద్దరూ బుక్ అయ్యారు. విజయ్-రష్మిక ఒకే గదిలో ఉన్నట్లు రుజువైంది. విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. రష్మిక మందాన సైతం అక్కడికే వెళ్లారు. వారి సోషల్ మీడియా పోస్ట్స్ నేపథ్యంలో ఇది స్పష్టమైంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ఓకే డెస్టినేషన్ ఎంచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.

ఈ అనుమానాలు ఆధారాలతో సహా నిర్దారించబడ్డాయి. రష్మిక ఆన్లైన్ చాటింగ్ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా రష్మిక ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఆమె అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. సదరు లైవ్ వీడియోలో సడన్ గా విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. విజయ్ దేవరకొండ కనిపించకపోయినప్పటికీ ఆయన అక్కడే ఉన్నాడని తెలిసింది. విజయ్ దేవరకొండ వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో నెటిజెన్స్ ఈజీగా గుర్తించారు. రష్మిక ఆన్లైన్ చాట్ లో ఉన్నప్పుడు విజయ్ ఎవరితోనో ఫోన్లో లేదా నేరుగా మాట్లాడుతున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో దేశాన్ని ఒప్పేస్తుంది. బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా కవర్ చేస్తుంది. రష్మిక-విజయ్ రిలేషన్ లో ఉన్నారు అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. ముంబైలో పలుమార్లు విజయ్-రష్మిక చక్కర్లు కొడుతూ కనిపించారు. వారు తరచుగా డిన్నర్ డేట్స్ కి వెళుతుండేవారు. అలా వీరి ఎఫైర్ రూమర్స్ మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితం కూడా ఇలానే ఒకే సమయంలో మాల్దీవ్స్ వెకేషన్ కి రష్మిక, విజయ్ వెళ్లారు. అప్పుడు కూడా మీడియాలో ప్రముఖంగా ప్రేమాయణం వార్తలు తెరపైకి వచ్చాయి.

కాగా విజయ్-రష్మిక గీత గోవిందం మూవీ కోసం మొదటిసారి కలిశారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఆ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ భారీ విజయం సాధించింది. గీత గోవిందం రష్మిక, విజయ్ దేవరకొండల కెరీర్స్ కి మంచి పునాది వేసింది. అనంతరం డియర్ కామ్రేడ్ మూవీలో మరోసారి జతకట్టారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ వీర లెవెల్ అని చెప్పాలి. ముద్దు సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించారు.
VD voice in the background😅😅#VIROSH #VijayDeverakonda #RashmikaMandanna
may be friends or may be something else 😜😜 pic.twitter.com/vYAraniND0— Bharath (@Bharath__b) January 2, 2023
[…] […]
[…] […]