Ramcharan-Upasana: ఉపాసన చెప్పినట్లే వింటా.. సంసార సీక్రెట్స్ చెప్పిన రాంచరణ్

ఇక ఇంతకుముందు చిరంజీవి కూడా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉపాసన రాంచరణ్ ఇద్దరు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ ఒకరి ఇష్టాలని మరొకరు గౌరవిస్తూ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఎవరు ఏ పని చేయాలి..?

Written By: NARESH, Updated On : December 29, 2023 7:49 pm
Follow us on

Ramcharan-Upasana: చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత చేసిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక అప్పటినుంచి ఆయన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడంతోపాటుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పాటు చేసుకునేలా చేశాయి.రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. గతవారం రాంచరణ్ ఉపాసన ఇద్దరూ కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అందులో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అవి ఏంటి అంటే తన సినీ కెరియర్ పరంగా మొదట్లో మంచి సక్సెస్ లు వచ్చినప్పటికీ ఆ తర్వాత తను చాలా ఒడిదోడుకులను ఎదురుకున్నాను అంటూ చెబుతూనే ఆ సమయం లో ఉపాసన నాకు ధైర్యాన్ని ఇచ్చింది.అలాగే నేను ఏ మాట చెప్పినా కూడా ఉపాసన వింటూ ఉండేది ఆమె వల్లే నేను ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపించాను. అప్పుడు ఆమె నేను ఏది చెప్తే అది విని నాకు సపోర్ట్ గా ఉండేది కాబట్టి ఇప్పుడు నేను ఉపాసన ఏం చెప్తే అది వినాలనుకుంటున్నాను. అలాగే ఆమెకు సపోర్టుగా ఉండాలనుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ ఉపాసన గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఇక దాంతో ఉపాసన కూడా మాట్లాడుతూ చిన్నతనంలో ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్ లో మా తాతయ్య తో కలిసి తిరిగే దాన్ని.. ఇంకా దానిని దేవాలయం గా భావించే దాన్ని.. ఇప్పటికి కూడా హాస్పటల్ ని నేను ఒక దేవాలయం గానే చూసుకుంటాను. మనం అంటూ ఈ భూమి మీద ఉండటాన్ని నలుగురు గుర్తించాలి అంటే మనకంటూ స్వతహాగా ఒక పేరుని మనం సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే వారికి సహాయం చేయడానికి మనం ఎప్పుడూ ముందుండాలి అంటూ తను ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

ఇక ఇంతకుముందు చిరంజీవి కూడా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉపాసన రాంచరణ్ ఇద్దరు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ ఒకరి ఇష్టాలని మరొకరు గౌరవిస్తూ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఎవరు ఏ పని చేయాలి..? ఏ పని చేయకూడదు అనేది మంచి అండర్ స్టాండింగ్ తో ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. చిరంజీవి ఇంతకుముందు కూడా ఈ విషయాలను చాలాసార్లు తెలియజేశాడు…