Rajamouli Mahesh movie with Chiranjeevi: బాహుబలితో ప్రభాస్ ను ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ ను చేశాడు రాజమౌళి. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమైన రాంచరణ్, ఎన్టీఆర్ లను ‘ఆర్ఆర్ఆర్’తో జాతీయ స్థాయి హీరోలను చేస్తున్నాడు.

అయితే అందం, అణుకువ, ఒడ్డూ పొడువు అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ బాబుకు ఆ అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడది రానే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్ తోనే రాజమౌళి సినిమా. ఇప్పటికే కథ రెడీ అయ్యిందని.. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 40 నిమిషాల సీరియస్ డ్రామా కోసం ఓ సీనియర్ హీరో అవసరం పడుతున్నారట..
ఈ కథలో హీరో మహేష్ కు, సీనియర్ హీరోకు అస్సలు పరిచయం ఉండదని.. ఇద్దరూ కలవరని.. కానీ సినిమాలో మాత్రం ఉంటారని రాజమౌళి కథలో వచ్చిందట.. దీంతో ఈ 40 నిమిషాల పాత్ర కోసం బాలీవుడ్ హీరోల కంటే తెలుగు హీరోలనే తీసుకుంటే బెటర్ అని రాజమౌళి ఆలోచిస్తున్నాడట..
ఈ క్రమంలోనే టాలీవుడ్ కోసం చాలా చేస్తున్నాడని ఇటీవల ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవిని ఈ పాత్ర కోసం ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నాడట.. అయితే మెగాస్టార్ ఇలా ఓ చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తాడా? అది మహేష్ లీడ్ రోల్ పాత్రలో ఉంటే పోషిస్తాడా? అంటే డౌట్ యే అంటున్నారు. మరి నిజంగా రాజమౌళి మల్టీస్టారర్ లో చిరంజీవినా? లేక మరో అగ్రహీరో వస్తారా? అన్నది వేచిచూడాలి.