Rahul Gandhi Speech on Union of States: పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అభాసుపాలయ్యాయి. భారతదేశాన్ని ‘ఫెడరేషన్ ’కాదని.. రాష్ట్రాల యూనియన్ అని వ్యాఖ్యానించారు. దీనికి రాజ్యాంగాన్ని ఉటంకించారు. రాజ్యాంగం జాతీయం గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని తేలిపోయింది. కనీసం రాజ్యాంగాన్ని రాహుల్ చదవలేదని అర్థమైంది.

రాహుల్ గాంధీకి దేశమంటే రాష్ట్రాల యూనియన్ అన్న మాటలు నవ్వుల పాలయ్యాయి. రాజ్యాంగంలో భారతదేశం ఒక సమాఖ్య అని మాట చెప్పారన్నది ముందు మాటలోనే రాశారు. నాదేశం అనే భావన పురాతన నుంచే దేశ ప్రజల్లో ఉంది.
ఇది రాజకీయ కారణాలతో దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా అభివర్ణించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. రాహుల్ అమాయకత్వంపై అందరూ విమర్శిస్తున్నారు. అసలు రాహుల్ గాంధీకి రాష్ట్రాలంటే లెక్కలోకి తీసుకుంటారా? రాష్ట్రాలను కాంగ్రెస్ అసలు పరిగణలోకి తీసుకుంటుందా? కల్చర్ ల పేరిట దేశమంతా రాష్ట్రానికి ఒకటి ఉంది. కానీ అంతా ఇది మన భారతదేశం అని ఓన్ చేసుకున్నారు. మన సంస్కృతులు వేరైనా దేశం ఒక్కటే.. ప్రజలంతా మేం భారతీయులు అన్న భావన మొదటి నుంచి ఉంది.
కాశీ, మధుర, అయోధ్య, తిరుపతి అందరిదీ.. రాష్ట్రాలుగా విడిపోయినా మన దేవుళ్లను, ఆధ్యాత్మికతను జనం ఓన్ చేసుకున్నారు. వేరుగా చూడలేదు.ఇక రాష్ట్రాలే దేశమంటున్న రాహుల్ గాంధీ.. 2014లో ఏపీ ఉమ్మడి అసెంబ్లీ తెలంగాణ వద్దని.. ఉమ్మడి రాష్ట్రమే ముద్దు అని తీర్మానం చేసినా ఎందుకు తెలంగాణను కేంద్రంలో ఉన్న అధికారంతో కాంగ్రెస్ విభజించింది? ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీయే కదా బలవంతంగా తెలంగాణ ఇచ్చేశారు. మరి రాష్ట్రాల యూనియన్ కు విలువ ఎక్కడ ఇచ్చారన్నది ప్రశ్న.. రాహుల్ గాంధీ ‘రాష్ట్రాల’ యూనియన్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
