Pomegranate: మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో దానిమ్మ ఒకటనే సంగతి తెలిసిందే. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో దానిమ్మ పండ్లు తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ దానిమ్మ పండ్ల ద్వారా లభిస్తాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. కీళ్లనొప్పులకు చెక్ పెట్టడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో దానిమ్మ తోడ్పడుతుంది.
అయితే రైతులు దానిమ్మను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా దానిమ్మకు డిమాండ్ ఉంటుంది. దానిమ్మ చెట్టు జీవితకాలం 25 సంవత్సరాలు కాగా మొక్క నాటిన నాలుగు సంవత్సరాలలో ఫలాలు వస్తాయి. ఉప-ఉష్ణమండల వాతావరణం దానిమ్మ మొక్కలు పెరగడానికి అనుకూల వాతావరణం అని చెప్పవచ్చు. దానిమ్మ విత్తనాలు గులాబీ రంగులో ఉంటాయి.
దానిమ్మ సాగు చేయడం ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇసుక నేలలు, నీటి పారుదల ఉన్న నేలలు ఈ పంటకు అనుకూల నేలలని చెప్పవచ్చు. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో దానిమ్మ మొక్కలను నాటడానికి అనుకూల సమయమని చెప్పవచ్చు.