Rahul Gandhi : రాహుల్ గాంధీ అవమానించింది ఉప రాష్ట్రపతిని కాదు, దేశాన్ని

రాహుల్ గాంధీ అవమానించింది ఉప రాష్ట్రపతిని కాదు, దేశాన్ని.. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : December 21, 2023 6:22 pm

Rahul Gandhi : నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరంగా చెప్పొచ్చు. పార్లమెంట్ బయట గేట్ల మీద కూర్చొని ఉపరాష్ట్రపతిని శరీరాకృతిపై కాంగ్రెస్ నేతలు హేళన చేయడాన్ని దారుణంగా చెప్పొచ్చు.. గూనీ వచ్చిన ఉపరాష్ట్రపతిపై కళ్యాణ్ బెనర్జీ అనే కాంగ్రెస్ నేత అవమనించడం పెద్ద దుమారం రేపుతోంది. రాజ్యసభ చైర్మన్ గా ఆయన చేసే పనులను విమర్శించండి.. కానీ ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది అందరూ ఖండించాల్సిన విషయం.

శరీరాకృతిని అవమానించడం అంటే దేశంలోని దివ్యాంగులందరినీ హేళన చేసినట్టే లెక్క. జాట్ కాబట్టి.. రైతు కాబట్టి హేళన చేశారని విమర్శించారని బీజేపీ అనడం సహేతుకం కాదు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవిలో ఉన్న వారు రాజ్యాంగ పదవులో ఉన్నవారు.. ప్రధాని పదవిలో ఉంటే విమర్శించొచ్చు..

విధానాలను విమర్శించాల్సింది పోయి.. ఆయన శరీరాకృతిని విమర్శించడం అంటే దేశంలోని దివ్యాంగులందరినీ అవమానించినట్టే.. దగ్గరుండి చూస్తూ రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ బుద్ది ఏమైంది? ఇక్కడ అన్నది ఆలోచించాలి.

రాహుల్ గాంధీ అవమానించింది ఉప రాష్ట్రపతిని కాదు, దేశాన్ని.. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..