Sandeep Reddy Vanga: అనిమల్ సినిమాని మించి అల్లు అర్జున్ సినిమా.. సందీప్ వంగ కాన్ఫిడెన్స్ కు కారణం అదే

క్యారెక్టర్ కి అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడు అనే రేంజ్ లో ప్రేక్షకుల్ని మైమరపించేలా ఈ సినిమాని తీర్చిదిద్దాలని సందీప్ రెడ్డి వంగ చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు.ఇక ప్రస్తుతం సందీప్ అనిమల్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో చాలా రికార్డులను కూడ బ్రేక్ చేస్తూ వస్తున్నాడు.

Written By: Gopi, Updated On : December 21, 2023 3:37 pm

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ని సందీప్ రెడ్డి వంగ తనదైన రీతిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాల్లో హీరోలని తనదైన ఒక క్యారెక్టరైజేషన్ తో పోట్రే చేశాడు. ఇక అదే విధంగా అల్లు అర్జున్ ని కూడా తనదైన రీతిలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడు అనే రేంజ్ లో ప్రేక్షకుల్ని మైమరపించేలా ఈ సినిమాని తీర్చిదిద్దాలని సందీప్ రెడ్డి వంగ చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు.ఇక ప్రస్తుతం సందీప్ అనిమల్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో చాలా రికార్డులను కూడ బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి కూడా సందీప్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో చేసే సినిమా అనిమల్ కంటే బోల్డ్ గా, కంప్లీట్ రా గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కథ పరంగానే కాకుండా మేకింగ్ పరంగా కూడా చాలా గ్రాండ్ గా భారీ స్కేల్లో సందీప్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని పూర్తి చేసేంతలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసే ఒక సినిమాని కంప్లీట్ చేస్తాడు.

Also Read: సలార్’ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఇక ఈ రెండు సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి అప్పుడు ఈ సినిమాని భారీ లెవెల్ లో ప్లాన్ చేసి తీయడానికైతే సందీప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి బౌండెడ్ స్క్రిప్ట్ ని వినిపించిన సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం ఒక సాలిడ్ ఎమోషన్స్ తో కూడుకున్నట్టు గా తెలియజేశాడు దాంతో ఈ సినిమా సక్సెస్ కి కారణం ఈ ఎమోషనే అనేది ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు…ఇక అలాగే ఈ సినిమాలో వైలెన్స్ కూడా ఎక్కువ గానే ఉండబోతున్నట్టుగా సందీప్ వంగ ఒక ఇంటర్వ్యూలో హింట్ అయితే ఇచ్చారు.

ఇక దీంతో అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ హిట్టు మాత్రం పక్కాగా ఇస్తాను అంటూ సందీప్ రెడ్డి వంగ ఇంతకుముందు చేసిన ఒక స్టేట్ మెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇదంతా చూసిన అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ హీరోకి మరో బ్లాక్ బాస్టర్ హిట్ రాబోతుంది అని చాలా సంబరాలు చేసుకుంటున్నారు…

Also Read: డంకి మూవీ ఫుల్ రివ్యూ