Queen Elizabeth-2: రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బ్రిటీష్ రాజకుటుంబంలోని మహా రాణి ఎలిజిబిత్ 2 96 ఏళ్ల వయసులో గురువారం స్కాట్ లాండ్ లోని బల్మోరల్ క్యాజిల్ లో కన్నుమూశారు. బ్రిటన్ ను ఈమె ఏకంగా 70 ఏళ్ల పాటు మహారాణిగా పాలించడం విశేషం. ఇంత సుధీర్ఘకాలం పాలించిన వారు చరిత్రలో చాలా తక్కవ.

గురువారం ఉదయం రాణి ఆరోగ్యం ఆందోళనకంగా ఉందన్న వైద్యులు చెప్పడంతో స్కాటిష్ ఎస్టేట్ కు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్ ఛార్లెస్, ఆయన భార్య కామిల్లా, మనవడు ప్రిన్స్ విలయమ్స్ బల్మోరల్ చేరుకున్నారు.
వేసవి విడది కోసం బల్మోరల్ వచ్చిన ఎలిజిబెత్ 2 అక్కడే ఉంటున్నారు. ఇటీవల రాణి వృద్ధాప్య సమస్యలతో నడవలేకపోతున్నారు. ప్రయాణాలు చేయడం లేదు.
రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు , వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన బ్రిటీష్ రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. బ్రిటీష్ రాణి మృతిపై బ్రిటన్ ప్రధాని, భారత ప్రధాని నరేంద్రమోడీ సహా దేశాధినేతలు సంతాపం తెలిపారు.
-కాబోయే బ్రిటన్ రాజు ఛార్లెస్.. పట్టాభిషేకం టైం?
బ్రిటన్ మహారాణి మరణంతో ఇప్పుడు ప్రిన్స్ ఛార్లెస్ కొత్త రాజు కాబోతున్నాడు. దీనికి కొన్ని నెలలు పడుతుంది. ప్రక్రియ సుధీర్ఘంగా ఉంటుంది. రాజు లేదా రాణి మరణం తర్వాత 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మతపెద్దలు సమావేశమై పార్లమెంట్ సమావేశపరిచి కొత్త రాజుకు తమ విధేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా బ్రిటన్ రాజును ప్రకటిస్తారు. రాజరిక చట్టాల ప్రకారం రాజుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
-క్వీన్ ఎలిజిబెత్ 2 ప్రస్థానం
ఎలిజిబెత్ పూర్తి పేరు అలెగ్జాండ్రా మేరి. డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య ఎలిజిబెత్ బోవెస్ ల పెద్ద కుమార్తె ఈమె. 1926, ఏప్రిల్ 21న లండన్ లో జన్మించారు. తండ్రి మరణంతో బ్రిటన్, ఐర్లండ్ లకు 1952, ఫిబ్రవరి 6న మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 70 ఏళ్లకు పైగా పాలించారు. 21 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా మారారు.
బ్రిటన్ ను అత్యధిక కాలం పాలించిన రాణిగా ఎలిజిబెత్ 2 రికార్డుల్లోకి ఎక్కారు. అంతకుముందు క్వీన్ విక్టోరియా 63 సంవత్సరాలపాటు పాలించారు. భర్త ప్రిన్స్ ఫిలిప్ గత ఏడాది 99 ఏళ్ల వయసులో మరణించారు. వీరికి నలుగురు సంతానం.
మొత్తంగా ఇన్ని సంవత్సరాల పాటు బ్రిటన్ ను పాలించిన మహారాణిగా ఎలిజిబెత్ 2 రికార్డు సృష్టించారు.