Indian Navy officers: భారత ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారిన ఖతార్ కోర్టు తీర్పు

ఆగస్ట్ 31, 2022 నుంచి ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిని ఖతార్‌లో నిర్బంధించారు, జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించిన గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

Written By: Neelambaram, Updated On : October 27, 2023 6:35 pm

ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ లో మరణశిక్ష విధించారు. భారత్ లో ఉన్నట్టువంటి అందరూ షాక్ కు గురయ్యారు. ఏం జరిగింది? ఎందుకు ఇంతమందిని ఒక్కసారిగా ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.. ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం.

గూఢచర్యం కేసులో 2022 ఆగస్టులో దోహాలో నిర్బంధించబడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతార్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం దేశంతో సంచలనమైంది.

భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా మరియు నావికుడు రాగేష్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30 న అరెస్టు చేసింది. వీళ్లంతా ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్లు ఒమన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఈ కంపెనీ సబ్ మెరైన్ లను నిర్మిస్తుంది.

ఆగస్ట్ 31, 2022 నుంచి ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిని ఖతార్‌లో నిర్బంధించారు, జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించిన గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

భారత ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారిన ఖతార్ కోర్టు తీర్పుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.