Pushpa Making Video Viral సినిమా అంటేనే ఒక రంగుల మాయాజాలం.. తెరపై ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తాయి. అయితే చూపించేవన్నీ నిజాలు కాదు.. చూసేవన్నీ వాస్తవాలు కాదు.. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ లో సీన్ల వరకూ ఈ ప్రపంచంలోనే ఉండవు. కానీ ఆయా సినిమాల్లో కనిపిస్తాయి. అదంతా ‘గ్రాఫిక్స్ ’ మాయాజాలమే. మనిషి ఊహాల్లోంచి పుట్టుకొచ్చిన ప్రకృతి వింతలే.. భారీ గ్రాఫిక్స్ ఉన్న చిత్రాల షూటింగ్ జరుగుతున్నప్పుడు వింత వింతగా తీస్తుంటారు. హీరోలకు వైర్లు కట్టేసి లేపేసి వెనుకాల గ్రీన్ మ్యాట్ పెట్టి కానిచ్చేస్తున్నారు. ఆ హీరోలకు కూడా సినిమాలో అసలు తమ వెనుకాల ఏం వస్తుంది? తాము దేనిపై ఉన్నాం.. దేనిపై ఫైట్ చేస్తున్నామో కూడా తెలియదు. సినిమా రిలీజ్అయ్యే వరకూ కూడా హీరోలు తాము షూటింగ్ చేసిందానికీ.. తెరపై కనిపించే దానికి అస్సలు పొంతన ఉండదు. అలాంటి గ్రాఫిక్స్ మాయాజాలం చిత్రాల్లో ఉంటుంది.

ఎందుకంటే సినిమాల్లో కనిపించే ఏ అడవులు ఈ భూమ్మీద అంత అందంగా ఉండవు. అలాంటి చోటు ఉండదు. అదంతా గ్రాఫిక్స్ మాయాజాలం. దాన్ని ప్రేక్షకులు తెరపై చూసి అబ్బో అంటూ కేరింతలు కొడుతుంటాడు. నిజానికి షూటింగ్ కు, సినిమా అవుట్ పుట్ చాలాతేడా ఉంటుంది. మేకింగ్ వీడియోలు చూస్తే కానీ అది ఎలా చేశారాన్నది బయటపడదు.
తాజాగా పుష్ప మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. అదిప్పుడు వైరల్ గా మారింది. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన పుష్ఫ భారీ హిట్ కొట్టింది. హిందీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాలోనూ భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేశారని తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి అర్థమవుతోంది. దర్శకుడు సుకుమార్ కూడా ఇందులో భారీగానే రిస్కీ షాట్స్ చేశాడని తెలుస్తోంది. థియేటర్లో తెరపై అద్భుతంగా ఆవిష్కృతమైన ఆ సీన్లు.. షూటింగ్ టైంలో అసలు సిల్లీగా చేశారని మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది.
అడవిలోంచి పోలీసుల కళ్లుగప్పి లారీలో ఎర్రచందనం దుంగలను దొంగిలించుకెళుతున్న అల్లు అర్జున్ ఒక పెద్ద బావిలో దాన్ని పడేస్తాడు. అయితే ఆ సీన్ తీసేటప్పుడు అసలు లారీనే లేదన్న విషయం మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియో చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప2లో బన్నీ మరింత అగ్రెసివ్ గా కనిపిస్తారని సమాచారం. పుష్ప మేకింగ్ వీడియోను కింద చూడొచ్చు.
Recommended Videos
