Prashant Neil – Shah Rukh Khan : రెండోసారి కూడా షారుక్ ఖాన్ మీద పైచేయి సాధించిన ప్రశాంత్ నీల్

ప్రభాస్ తో సలార్ సినిమా చేసిన ప్రశాంత్ నీల్ డంకి సినిమాకి పోటీగా రావడమే కాకుండా మరోసారి షారుక్ ఖాన్ మీద పై చేయి సాధించాడు. ఇక ఇప్పటికే డంకి ఫ్లాప్ టాక్ తో చతికలబడింది.

Written By: NARESH, Updated On : December 23, 2023 8:49 am
Follow us on

Prashant Neil – Shah Rukh Khan : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అయి అద్భుతమైన కలక్షన్లతో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గాని, హీరో ప్రభాస్ గాని ఈ సినిమా సక్సెస్ మీద చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని వాళ్ళు ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నప్పటికీ మధ్యలో కొంతమంది ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారాలు చేశారు.అయినప్పటికీ ఫైనల్ గా ఈ సినిమా థియేటర్ లోకి వచ్చింది దాంతో ఈ సినిమా భారీ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

అయితే ఇప్పుడు ఈ వీకెండ్ లో ఆ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టే ప్రయత్నం కూడా చేస్తుంది…ఇక ఇదిలా ఉంటే రెండోసారి కూడా షారుక్ ఖాన్ మీద ప్రశాంత్ నీల్ విజయాన్ని సాధించాడు అంటూ సోషల్ మీడియా లో చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి.ప్రశాంత్ నీల్ ఏంటి షారుక్ మీద విజయం సాధించడం ఏంటి అనుకుంటున్నారా..? అసలు మ్యాటర్ లోకి వెళ్తే 2018 లో కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అయినప్పుడు షారుక్ ఖాన్, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన జీరో సినిమా రిలీజ్ అయింది. ఇక అప్పుడు కన్నడ నుంచి వచ్చిన కెజీఎఫ్ మీద పెద్దగా అంచనాలైతే లేవు.

మళ్లీ షారుక్ ఖాన్ మీద పోటీకి వచ్చేంత సినిమా అయితే కాదు అని అందరూ అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అంచనాలు మొత్తం తారుమారయ్యాయి. జీరో సినిమా ప్లాప్ అవ్వగా, రాఖీ భాయ్ మ్యాజిక్ ను చూసిన బాలీవుడ్ ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోయింది ఆ సినిమా కి ఫిదా అయిపోయారు. ఇక అదే విధంగా ఇప్పుడు ప్రభాస్ తో సలార్ సినిమా చేసిన ప్రశాంత్ నీల్ డంకి సినిమాకి పోటీగా రావడమే కాకుండా మరోసారి షారుక్ ఖాన్ మీద పై చేయి సాధించాడు. ఇక ఇప్పటికే డంకి ఫ్లాప్ టాక్ తో చతికలబడింది.

ఇక ఇదే రేంజ్ లో సలార్ సినిమాకి హిట్ టాక్ రావడంతో డంకి డిజాస్టర్ దిశగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ క్రమంలో వీకెండ్ ఉండటం అందులో క్రిస్మస్ పండగ కూడా ఉండడం వల్ల డంకీ ఏదైనా కలెక్ట్ చేస్తే ఈ రెండు, మూడు రోజుల్లోనే కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సలార్ దెబ్బకి మాత్రం నిలబడలేక పోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కొన్ని చోట్ల థియేటర్ లో నుంచి తీసేసి ఆ స్క్రీన్ లను సలార్ సినిమా కోసం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది..