Rajasthan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ నెలకొన్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాత్ బరిలో నిలుస్తారని కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. ఆయనకు సోనియాగాంధీ మద్దతు కూడా ఉండటంతో ఆయన ఎన్నిక ఖాయమేననే వాదనలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం సీఎం పదవికే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అధ్యక్ష పదవి కోసం మళ్లీ నేతల్లో పోటీ వాతావరణం ఏర్పడింది. సోనియాగాంధీ సుదీర్ఘ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగినా ఆరోగ్య కారణాల రీత్యా ఆమె ఆ పదవికి దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులు రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష బాధ్యతలు పోషించినా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధంతోనే అధికారానికి దూరమవుతూ వచ్చింది. ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ చివరకు ఒకే రాష్ట్రంలో అధికారంలో ఉండటం గమనార్హం. అశోక్ గెహ్లాత్ కు అన్ని పరిస్థితులు అనుకూలించినా ఆయన సీఎం పదవి వీడటానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఏఐసీసీ అధ్యక్ష పీఠం ఆయనకు దక్కడం లేదు. సోనియాగాంధీ మరో నేత కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: Jasprit Bumrah: ప్రపంచకప్ ముందుర భారత్ కు భారీ షాక్.. ఆ కీలక ప్లేయర్ గాయంతో ఔట్
కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించే నేత కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. కానీ అంత సమర్థుడైన నాయకుడు దొరుకుతాడో లేదోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నా సోనియాగాంధీ మదిలో మాత్రం ఎవరున్నారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని పలువురు నేతలు కోరుతున్నా అందుకు ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కాను అని ప్రకటించారు.

దీంతోనే పార్టీలో అంతర్గతంగా పరిస్థితులు బాగా లేవు. ప్రస్తుతం అధ్యక్ష పదవిని భర్తీ చేసే విషయంలో నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చుండే వ్యక్తి కోసం గత కొంత కాలంగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యమంత్రి పదవిపై ఉన్న మక్కువతోనే అశోక్ గెహ్లాత్ ఆ పదవి కావాలని డిమాండ్ చేయడం లేదు. మొత్తానికి అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు. సోనియాగాంధీ ఎవరిని నియమించి పార్టీ పగ్గాలు అప్పగిస్తారోనని సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Deepika Padukone: హాస్పిటల్ లో దీపికా పడుకోణె… ప్రెగ్నెంట్ అంటూ వార్తలు…!
[…] Also Read: Rajasthan Political Crisis: రాజస్థాన్ సంక్షోభం: కాంగ్ర… […]