https://oktelugu.com/

పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.300 చెల్లిస్తే రూ.2 లక్షలు మీ సొంతం..!

ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్ లో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. Also Read:ఏ స్థానంలో ఆడమన్నా ఓకే: రోహిత్ శర్మ ఇండియా పోస్ట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 25, 2020 / 12:58 PM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్ లో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

    Also Read:ఏ స్థానంలో ఆడమన్నా ఓకే: రోహిత్ శర్మ

    ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారో వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు పోస్టాఫీస్ నుంచి 2 లక్షల రూపాయలు అందుతాయి. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం పోస్టాఫీస్ ల ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

    Also Read: భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు.. చివరకు..?

    దేశంలోని పేద ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్నవాళ్లు సంవత్సరానికి 330 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం: జనరల్

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పాలసీ తీసుకున్న వాళ్లకు ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో సైతం బ్యాంక్ సర్వీసులను అందిస్తూ ఉండటం గమనార్హం.