Caste Politics in AP: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను నేడు రెండోసారి పునర్వస్థీకరించనున్నారు. ఈరోజు ఉదయం 11గంటల 19నిమిషాలకు కొత్త మంత్రవర్గంచే గవర్నర్ బిశ్వ భూషణ్ హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే అధికారులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కించుకున్న వారంతా సంతోషం వ్యక్తం చేస్తుండగా పదవులు కోల్పోయిన వారంతా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
CM Jagan
ఏపీ కొత్త క్యాబినేట్ కూర్పు చూస్తుంటే ప్రస్తుతం మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికీ కూడా ప్రతిభ కంటే కులమే కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. కొత్త క్యాబినెట్లో పాత మంత్రులు 11మంది ఉండగా కొత్తగా 14మందికి అవకాశం దక్కించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గంలో దళిత, బీసీ వర్గాలకు గతంలో కంటే ఒక్కొటి చొప్పున పదవులను పెంచారు.
జగన్ నిర్ణయాన్ని వైసీపీ నేతలంతా ఇదొక సామాజిక మహా విప్లవం అంటూ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే వైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ‌్మణ వర్గాలకు మాత్రం ఈసారి బెర్త్ దక్కలేదు. మరోవైపు రెడ్డి వర్గానికి ఒక్క పదవీకి కూడా పోస్టు కూడా తగ్గించకలేదు. దీనికి తోడు పరోక్షంగా ఆ వర్గానికి పదవులను పెంచారు.
జగన్మోహన్ రెడ్డితో కలిపి ఏపీ క్యాబినెట్లో మొత్తం ఐదుగురు రెడ్డి వర్గానికి చెందిన మంత్రులున్నాయి. అదేవిధంగా బీసీ కోటాలో మంత్రి పదవీ దక్కించుకున్న ఓ మహిళ భర్త కూడా రెడ్డినే. దీంతో ఆ వర్గానికి మొత్తంగా ఆరు మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది. అగ్రవర్గాలకు కాపుల్లో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కోత విధించడం గమనార్హం.
వైశ్య వర్గానికి ప్రతిసారి క్యాబినెట్లో బెర్త్ దక్కుతుండగా ఈసారి మాత్రం ఆ వర్గానికి మంత్రి పదవీ దక్కలేదు. అలాగే కమ్మ వర్గానికి కూడా మంత్రి పదవీ ఇవ్వలేదు. బ్రహ్మణ, క్షత్రియ వర్గాలను పట్టించుకోలేదు. బీసీల్లో పది మందికి పదవులు ఇచ్చామని చెప్పుకున్న నేతలు ఆయా వర్గాలకు నిధులు, ఉపాధి, సంక్షేమం అమలు చేయకుండా ఎన్ని పదవులు ఇస్తే ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొంతమందిని పదవుల నుంచి తప్పించి.. మరికొంతమందికి పదవులు ఇస్తే సామాజిక మహా విప్లవం ఎలా అవుతుందో వైసీపీ నేతలే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా జగన్ క్యాబినేట్ కూర్పు ప్రతిభ కంటే కూడా కులం ‘కార్డు’కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కన్పిస్తోంది. మరీ ఈ కులాల ఈక్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!