ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లు.. తన జీవితాన్ని ఇచ్చిన ఆ రూమును త్రివిక్రమ్ ఇప్పటికీ మరిచిపోలేదట.. ఇప్పుడు టాలీవుడ్ లోనే గొప్ప దర్శకుడిగా ఎదిగిన త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హైదరాబాద్ లో అష్టకష్టాలు పడ్డాడన్న సంగతి తెలిసిందే.. కమెడియన్ సునీల్, దర్శకుడు దశరథ్, త్రివిక్రమ్ లు కలిసి పంజాగుట్టలోని ఒక చిన్న రూములో అద్దెకు ఉండేవారు. రూమ్ రెంట్ కూడా కట్టలేని స్థితిలో ఉండేవాడు.
కానీ అదే రూమ్ త్రివిక్రమ్ ను రచయితగా నిలబెట్టింది. అనంతరం దర్శకుడిగా మార్చింది. అందుకే జీవితాన్ని ఇచ్చిన ఆ చిన్న రూమ్ ను ఇప్పటికీ వదలలేదట త్రివిక్రమ్. ఇప్పటికీ ప్రతి నెల రూ.5వేల రూపాయలను పంజాగుట్టలోని రూమ్ ఓనర్ కు పంపిస్తుంటాడట త్రివిక్రమ్.
ఇక దర్శకుడు త్రివిక్రమ్ కోరిక మేరకు ఎవరు ఎంత ఎక్కువ ఇస్తానన్న కూడా ఆ రూమ్ ఓనర్ ఎవరికి రెంట్ కు ఇవ్వడం లేదట. అప్పుడప్పుడూ త్రివిక్రమ్ వెళ్లి మరీ రూమ్ లో కూర్చొని కాసేపు సేదతీరి వస్తాడట.. అలా తన తొలి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడట..
20 ఏళ్లుగా త్రివిక్రమ్ తాను తొలి సినీ ప్రయాణంలో తోడుగా ఉన్న రూమ్ కు రెంట్ చెల్లిస్తున్నాడన్న విషయం చర్చనీయాంశమైంది. సెంటిమెంట్లను ఫాలో అవ్వడు అని పేరున్న త్రివిక్రమ్ ఇప్పుడు వాటిని ఫాలో అవ్వడం.. 20 ఏళ్లుగా కొనసాగిస్తుండడం విశేషంగా మారింది.
Also Read: Akhanda Movie: బాలయ్య అభిమానులకు అదిరిపోయే అప్డేట్… “అఖండ” ట్రైలర్ ఎప్పుడంటే ?