
Pawan Kalyan : జనసేనాని వారాహి యాత్ర మొదలైంది. అనుకున్నట్టే అద్భుతంగా కత్తిపూడి సభ జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. అన్నవరం నుంచి కత్తిపూడి వరకు పవన్ కళ్యాణ్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పవన్ యాత్ర సుగుతున్న రోడ్లకు ఇరువైపులా జన సైనికులు, ప్రజలు నిరాజనాలు పలికారు. దారిపొడవునా జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ నినాదాలు మారుమోగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగారు. దీంతో రహదారికి ఇరువైపులా జనసేన జెండాలు, జనమే కనిపించారు.
అన్నవరం నుంచి కత్తిపూడి వరకు రహదారికి ఇరువైపులా సాగిన జన ప్రవాహం.. కత్తిపూడిలో సభా ప్రాంగణంలో జన కెరటమై పోటెత్తింది. పవన్ వారాహియాత్ర తొలి సభకు భారీగా తరలివచ్చిన జనం, జనసైనికులతో కత్తిపూడి కిటకిటలాడింది. అభిమానులు, జనం, జన సైనికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
ఇక కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కరావలం(కత్తి) బహూకరించారు. వారాహి వాహనంపై నిలబడిన జనసేనాని దానిని తిప్పుతు అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పవన్ కత్తి పట్టగానే సభా ప్రాంగణం సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తింది.
ఇక కత్తిపూడి సభలో జనసేనాని ప్రసంగం ఆసాంతం అందరినీ ఆకట్టుకుంది. కత్తిలాంటి పంచుంలతో వైసీపీ పాలనను ఎండగట్టారు. జగన్ పేరు ఎత్తకుండా పెద్దమనిషి అంటూ తనపై సీఎం చేసిన ప్రతీ ఆరోపణకు బదులిచ్చారు. దీంతో సభాప్రాంగణం, కత్తిపూడి వీధులన్నీ జనసేన నినాధాలతో మార్మోగాయి. తొలిసభకే జనం కెరటంలా పోటెత్తడంతో జనసేన నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
జన ప్రభంజనంతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.