Pawan Kalyan Instagram: పవర్ స్టార్.. జన సేనాని.. పవన్ కళ్యాణ్.. పేరులోనే కాదు.. ఫాలోవర్స్‌లోనూ పవర్ ఉంది. తెలుగు హీరోస్‌లో బహుషా అత్యధిక మంది అభిమానులు ఉన్నది పవన్‌కే అనుకుంటా. ఇంత అభిమానం ఉన్న పవన్.. రాజకీయల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంత మంది అభిమానం సంపాదించుకున్న పవర్ స్టార్ సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ పరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా పవన్ ఎప్పుడూ పోస్టులు పెట్టరు. రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే రాజకీయాల కోసమే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు పవన్. సినిమా కార్యక్రమాలకు కూడా పవన్ చాలా వరకు దూరంగా ఉంటారు. అయితే ఇటీవలో ఇన్‌స్టాలోకి వచ్చారు.
ఓపెనింగే ఓ సంచలనం..
ఇన్‌స్టాలో పవన్ ఖాతా ఓపెన్‌చేయడమే సోషల్ మీడియా చరిత్రలో ఓ సంచలనం రేపింది. రికార్డులు సృష్టించింది. పవన్ ఇన్‌స్టా ఖతా తెరిచారని తెలియడంతోనే మిలియన్స్ ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉంటున్న ఏపీ సీఎంకు కూడా లేనంత ఫాలోయింగ్ పవన్‌కు వచ్చింది. గంటల వ్యవధిలోనే పవన్ ఇన్‌స్టా ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య 1.3 మిలియన్స్‌కు చేరింది. ఏళ్లుగా ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్న ఏపీ సీఎం వైఎస్. జగన్ ఫాలోవర్స్ మాత్రం ఇప్పటికీ 701 కే మాత్రమే. ఇంకా పవన్ తన ఖాతాలో ఒక్క పోస్టు కూడా పెట్టక ముందే పవర్ చూపించాడు.
అదిరిపోయే క్యాప్షన్..
ఇక ఇన్‌స్టా ఖాతాకు పవన్ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చాడు. ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నికో.. అనే క్యాప్సన్ పవన్, జనసేన అభిమానులను, కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. సమాజాన్ని చైతన్య పర్చేలా ఉన్న క్యాప్ఫనే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఫాలోవర్స్‌గా మారుస్తోంది. ఇక దీనిపై విపక్షాలు నోరు మెదపడం లేదు. ఎలాంటి విమర్శలు చేకుండానే ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారని, ఇప్పడు దీనిపై విమర్శలు చేస్తే పవన్ ఇన్‌స్టా ఖాతాను వెతికి మరీ ఫాలో అవుతారని వైఎస్సార్‌సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. విమర్శ ద్వారా పవన్‌కు ప్రచారం కల్పించినట్లు అవుతోందని పేర్కొంటున్నారు.
ఇన్నేళ్లయినా అందుకోని జగన్..
ఇక ఏపీ సీఎం జగన్ ఇన్‌స్టా యాత్ర ప్రారంభం నుంచే ఖాతాదారుగా ఉన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా అగ్రెసివ్ పాలిటిక్స్ చేసినా పవన్‌కు ఉన్న ఫాలోవర్స్‌లో సగం కూడా సంపాదించుకోలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా నాలుగేళ్లు అయింది. అయినా ఫాలోవర్స్ మాత్రం 701 కేదాటలేదు.. ముఖ్యమంత్రి పదవి అయిపోయాక దాటుటాడన్న నమ్మకం లేదు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా ఖాతా సోషల్ మీడియా రికార్డులనే తిరగ రాసిందని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఊపును 2024 ఎన్నికల వరకూ కొనసాగిస్తామని పేర్కొంటున్నారు.