Pawan Kalyan’s protests : పవన్ ఏది చేసినా అంకితభావంతో పాటు మనస్ఫూర్తిగా చేస్తారు. అది సినిమాలైనా.. రాజకీయాలు అయినా. అందుకే అంతలా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. పవన్ అంటే ఓ వ్యసనంలా మారిన వారు కూడా ఉన్నారు. పవన్ఆచితూచి అడుగులేయగలరు. అవసరమైతే దూకుడును ప్రదర్శించగలరు. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది. తాజాగా రోడ్డుపై పడుకుని మరి నిరసన తెలిపారు. తాను అనుకుంటే ఎంత దాకైనా పోయేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబును పరామర్శించేందుకు విజయవాడ వస్తున్న పవన్ ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ అర్ధరాత్రి పవన్ చేపట్టిన నిరసనతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి.
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఆక్రమణల పేరుతో ఇళ్లను కూల్చివేసిన సంగతి విదితమే. అప్పట్లో దీనిపై పవన్ కళ్యాణ్ గట్టిగానే స్పందించారు. నేరుగా ఇప్పటం గ్రామస్తులను పరామర్శించడానికి వెళ్లారు. పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. కానీ పవన్ అదరలేదు బెదరలేదు. పోలీసులను ప్రతిఘటిస్తూ ముందుకు సాగారు. పవన్ దూకుడు ముందు పోలీసులు సైతం చేతులెత్తేశారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
విశాఖలో జనవాని కార్యక్రమానికి హాజరైన పవన్ పోలీసులు అడ్డుకున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పవన్ రెండు రోజులు పాటు హోటల్ కే పరిమితం చేశారు. అప్పట్లో జన సైనికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సమయంలో పవన్ నిగ్రహం పాటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. పోలీసులకు సైతం గౌరవిస్తూ వారి నుంచి నోటీసులు తీసుకున్నారు. ఆ సమయంలో పవన్ వ్యూహాత్మక మౌనం పాటించారు. నాడు ఎయిర్పోర్ట్ ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. పవన్ ర్యాలీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అధికార పక్షం ప్రయత్నాలు చేసినా పవన్ మౌనాన్ని పాటించారు. అటు పార్టీ శ్రేణులను సైతం నియంత్రించారు. అప్పట్లో పవన్ వ్యవహార శైలి.. పోలీసు అధికారుల అభినందనలను అందుకుంది.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో.. పవన్ వ్యవహరించిన తీరు కూడా అభినందనలు అందుకుంటుంది. తొలుత ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుండి విజయవాడ రావాలని పవన్ ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అయితే అప్పటికప్పుడు రోడ్డు మార్గం గుండా వచ్చేందుకు పవన్ సిద్ధపడ్డారు. దీంతో అర్ధరాత్రి రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో చుట్టూ వేలాది మంది జనసైనికులు ఉన్నారు. అయినా సరే పవన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పోలీసులు అనుమతించకపోవడంతో నడి రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. వీలైనంతవరకు పోలీసులకు ప్రశ్నలు సంధించారే తప్ప.. పార్టీ శ్రేణులకు ఎక్కడా రెచ్చగొట్టలేదు. ఒకానొక దశలో పవన్ను తీసుకెళ్తున్న పోలీసులను జనసైనికులు అడ్డగించారు. పరిస్థితి చేయి దాటి పోతుందని తెలిసి పవన్ పార్టీ శ్రేణుల కోసం వెనక్కి తగ్గారు. అయితే అర్ధరాత్రి పవన్ పరితపించిన తీరు చూసి టిడిపి శ్రేణులు సైతం అభినందనలతో ముంచెత్తుతున్నాయి. పవన్ మనస్తత్వం ఇంకో నాయకుడికి ఉండదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyans protests go viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com