ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : ఓటమియే గెలుపునకు నాంది.. పవన్ ఫెయిల్యూర్ నేత ఎప్పటికీ కాదు.. కాదంతే?

Pawan Kalyan : ఓటమియే గెలుపునకు నాంది.. పవన్ ఫెయిల్యూర్ నేత ఎప్పటికీ కాదు.. కాదంతే?

Pawan Kalyan : ‘తాను ఒక విఫల నేతను’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం అందర్నీ ఆకర్షించింది. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో వేలాది మంది చార్డర్ట్ అకౌంట్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పే క్రమంలో తన జీవితంలో ఎదురైన పరిణామాలను వారికి వివరించారు. తాను విఫల నేతనే కానీ.. ఓటమి చెందలేదని.. విజయాన్ని అందుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తునే ఉన్నానని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఓటములు వివరించే క్రమంలో పవన్ చేప్పిన మాటలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. అటు విశ్లేషకులు సైతం పవన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పవన్ తనను తాను విఫల నేతగా పరిధి తగ్గించుకోలేదని.. పరిణితితో కూడిన వ్యాఖ్యలే చేశారని అభిప్రాయపడుతున్నారు.

2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పురుడుబోసుకుంది జనసేన. వెంట ఎవరూ లేరు.. మరో ప్రజారాజ్యం అంటూ ఎగతాళి చేశారు. పీఆర్పీ పర్యవసానాలతో అసలు పార్టీ నడిపించగలడా అని కామెంట్స్ చేశారు. ఆవేశపరుడూ.. అసలు ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోగలడా? అని ప్రశ్నించారు. మరో జాతీయ పార్టీలో జనసేన విలీనం కాక తప్పదని విశ్లేషించారు. ఇలా ఎదురైన ప్రతీ ప్రశ్నకు, సవాల్ కు జవాబు చెబుతూ పవన్ ముందుకు సాగారు. ఏపీ రాజకీయ యవనికపై జనసేనను నిలబెట్టారు. అజేయమైన శక్తిగా, ప్రజాభిమానం చూరగొంటున్న పార్టీగా తీర్చిదిద్దారు. 2024 ఎన్నికల్లో జనసేన లేని ప్రభుత్వం ఊహించుకోలేమన్న విశ్లేషణ స్థాయికి ర్టీని నిలబెట్టగలిగారు.

తెలుగునాట ఎన్నో పార్టీలు తెరపైకి వచ్చాయి. కొద్దిరోజులకే తెరమరుగయ్యాయి. పార్టీని నడపడం అనేది ఒక ఉద్యమం. రాజకీయాలంటే ఎత్తుకు పైఎత్తులు. కోట్లాది రూపాయల పెట్టుబడులు. ఆపై అంగబలం, ఆర్థిక బలం, సామాజికవర్గ బలం.. అంతకంటే మించి ప్రత్యర్థి పార్టీల హానికరమైన మనస్థత్వం నుంచి పార్టీని కాపాడుకోవడం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు పవన్ కళ్యాణ్. దశాబ్ద కాలం చేతికి పవర్ లేదు. పార్టీకి సీట్లు లేవు. కానీ ఏపీ రాజకీయాల్లో మార్పునకు, సంచలనలకు కేంద్రమవుతున్నారు. అందరికీ పవన్ కావాలన్న రేంజ్ లో జనసేనను నిలబెట్టారు. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి.. అంతెందుకు వామపక్షాలు సైతం పవన్ భావజాలానికి ఇష్టపడుతున్నాయంటే పవన్ అందరివాడు.

పొలిటికల్ పార్టీలకు గెలుపోటములు సహజం. కానీ పవన్ కు ఇంతవరకూ గెలుపు పలుకరించలేదు. కానీ ఆయనెప్పుడు నిరాశ చెందలేదు. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసిన పవన్ కు రెండింటా నిరాశ చెందలేదు. ఓడించారు కదా అని ప్రజలపై నిష్టూరమాడలేదు. వారిపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆ గొప్ప మనసే ప్రజలను పవన్ కు మరింత దగ్గర చేస్తోంది. ఓటమే గెలుపునకు నాంది అని నమ్ముతున్న వ్యక్తి పవన్. సమాజంలో మార్పు రావాలని ..అందులో తాను ఒక భాగస్వామ్యం కావాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ కార్యాచరణలో మాత్రం దిగరు. కానీ పవన్ మాత్రం విలాసవంతమైన జీవితం వదిలి సైతం సమాజ మార్పునకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ తాను చెప్పుకుంటున్నట్టు ఫెయిల్యూర్ నేత కాదని.. ఫెయిలైనట్టు కూడా కాదని.. అతనొక సక్సెస్ పుల్ లీడర్ గా ఏపీ రాజకీయ యవనికపై నిలబడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version