Pawan Kalyan – Modi : మోడీపై పవన్ కళ్యాణ్ ఆ మాట.. ఫిదా చేసేశాడు..

తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసేందుకు అనుమతించినందుకు మోదీకి, రాష్ట్ర బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Written By: NARESH, Updated On : November 7, 2023 8:21 pm
Follow us on

Pawan Kalyan – Modi : తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మ గౌరవ సభలో మోదీ, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరై బీజేపీకి మద్దతు ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు ఫలితాలు పేదలకు చేరడం లేదని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మహిళా బిల్లును తీసుకొచ్చినందుకు మోదీని ప్రశంసించిన పవన్ కళ్యాణ్ భారతీయులలో ధైర్యాన్ని నింపిన వ్యక్తి మోదీ అని అన్నారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒక్క దశాబ్దంలో సాధించారని పవన్ కల్యాణ్ అన్నారు.

తనకు మోడీ‘పెద్దన్న’గా ప్రస్తావిస్తూనే, ఈరోజు తాను ఇలా ఉండడానికి ప్రోత్సహించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మోడీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్రమోడీ.. ఆయన మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోడీ అని పవన్ అన్నారు.

తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసేందుకు అనుమతించినందుకు మోదీకి, రాష్ట్ర బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపే ముందు పవన్ కళ్యాణ్ ‘ఔర్ ఏక్ బార్ మోదీ జీ ఆనా చాహియే’ (మోదీ మరోసారి ప్రధాని కావాలి) అంటూ నినాదాలు చేశారు. ఇంతలో మోడీ తన ప్రసంగంలో, ‘పవన్ వేదికపై నాతో ఉన్నారు, కానీ అభిమాన వరద నా ముందు ఉంది’ అంటూ అని కార్యక్రమంలో భారీగా వచ్చిన ప్రజలకు చూపించారు.

మోడీ తనకు పెద్దన్న అని.. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపం మోడీ అన్న పవన్ మాట కు ప్రజలంతా ఫిదా అయిపోయారు. ఈ అనుబంధంపై హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో స్వాగతించారు.