Pawan Kalyan vs NTR Fans: ‘పిల్ల పుట్టకుముందే కుల్ల కుట్టడం అంటే ఇదేనేమో’.. కనీసం తమ అభిమాన తారల్లో ఒకరు ఎమ్మెల్యేగానే గెలవలేదు. ఇంకొకరు అసలు రాజకీయాల్లోకే రాలేదు. వారిని పట్టుకున్న బట్టలు చింపుకునే వారి అభిమానులు ఇప్పుడు తమ హీరోనే ‘సీఎం’ అని ఆధ్మాత్మిక జాతరలో పెంట పెంట చేశారు. ఇదెక్కడి చోద్యంరా నాయనా అని భక్తులంతా ముక్కున వేలేసుకున్న పరిస్థితి నెలకొంది.

వెర్రికైనా ఓ హద్దు ఉంటుంది. అక్కడ జరిగేది పవిత్రమైన మహాంకాళి జాతర.. పశ్చిమ గోదావరి జిల్లా పాలమూరు మహంకాళి జాతర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలపడ్డారు. తమ హీరోనే సీఎం అంటూ రచ్చ రచ్చ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.
సినిమా ఫ్యాన్స్ అంటేనే వారి అభిమానం ఆకాశమంత ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. వారిని ఆపడం అాసాధ్యం. అలాంటి ఫ్యాన్స్ తో నందమూరి ఫ్యాన్స్ తలపడ్డారు.
పశ్చిమగోదావరిలోని పాలమూరు మహంకాళి జాతరలో కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుగా ‘సీఎం పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దీన్ని తట్టుకోలేకపోయారు. వెంటనే ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని వచ్చి ‘సీఎం ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా సాగుతున్న మహంకాలి జాతరలో వాతావరణం వేడెక్కింది. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఈ అభిమానుల గుంపును చెదరగొట్టారు. లేకుంటే వీరంతా తన్నుకొని రచ్చ రచ్చ అయ్యిండేది. కనీసం ఎమ్మెల్యేగా గెలవని పవన్ కళ్యాణ్ ను.. రాజకీయాల్లోకే రాని ఎన్టీఆర్ ను పోల్చి సీఎం సీఎం అనడం ఏంట్రా అని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. . జాతరకు హాజరైన భక్తులు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన సందర్భాన్ని పాడు చేస్తున్నారు? అని ఈసడించుకున్నారు. “ప్రతిదానికీ సమయం మరియు సందర్భం ఉండాలంటూ హితవు పలికారు. ఇలాంటి అభిమానుల వల్లే ఆ హీరోలకు చెడ్డ పేరు వస్తోందని తిట్టిపోశారు.
https://twitter.com/likhith_09/status/1534026405662425089?s=20&t=AVOg0-yTGkw1Zpqbii0SRg