Metro MMTS: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్.బీ) నుంచి హైదరాబాద్ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి రాకపోకలు పెరుగుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్సింగి ప్రాంతాలు.. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ -కోకాపేట్‌ల గుండా వెళ్లే మార్గంతో ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని ప్రారంభించిన తర్వాత ప్రయాణం మరింత సులభతరమై వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకుంటున్న పుకార్లను కొట్టివేస్తూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం త్వరలోనే సాకారం అవుతుందని అధికారులు ధృవీకరించారు. భవిష్యత్ తరాలకు ప్రజా రవాణా అవసరాలను తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 24 స్టేషన్లతో 29 కి.మీ. ఈ సదుపాయం కల్పించనున్నారు. కేపీహెచ్.బీ మరియు రాయదుర్గ్ వద్ద ఇప్పటికే ఉన్న మెట్రో రైల్ కారిడార్‌లు, హౌటెక్ సిటీ వద్ద ఎంఎంటీఎస్ -నార్సింగి వద్ద ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లైన్‌కు కలుపుతున్నారు. దీనివల్ల హైదరాబాదీలకు వాణిజ్య ప్రాంతాలకు కనెక్టివిటీ కుదిరి మరింత చేరువ అవుతుంది. ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అలైన్‌మెంట్, టెక్నాలజీ ఆప్షన్‌లు, ఆర్థిక విశ్లేషణ, ఇతర అంశాలతో కూడిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ఇప్పటికే తుదిరూపు ఇచ్చారని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (HUMTA)హైదరాబాద్‌ను తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాలలోని టైర్-2 నగరాలకు కలుపుతూ సెమీ హై-స్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తోంది.. హైదరాబాద్ నుండి వరంగల్ మరియు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ప్రతిపాదిత సెమీ-హై స్పీడ్ రైలు కనెక్టివిటీ కోసం ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఇప్పటికే ప్రసిద్ధ.. అనుభవజ్ఞులైన సంస్థల నుండి ప్రతిపాదనలు ఆహ్వానించారు. నగరంలో ప్రజా రవాణాకు మరో ప్రధాన ప్రోత్సాహం పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS), ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీ మరియు ఇనార్బిట్ మాల్ పరిసర ప్రాంతాలకు చివరి మైలు వరకూ కనెక్టివిటీని అందిస్తుంది. గుర్తించబడిన కారిడార్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌ను మైండ్‌స్పేస్, ఇనార్బిట్ మాల్, అరబిందో, నాలెడ్జ్ సిటీ, మై హోమ్ భూజా, స్కైవ్యూ మరియు ఐటీసీ కోహెనూర్‌తో కలుపుతూ 7.5 కి.మీలు అనుసంధించనున్నారు.
మొదటి మరియు చివరి-మైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) పర్యావరణ పరిరక్షణ పద్ధతిని అవలంబించింది. ఎలక్ట్రిక్ ఆటోలు.. బైక్‌లకు సేవలను అందించింది. ఈ-వాహనాలు ప్రయాణికులను మెట్రో రైలు మొదటి మరియు చివరి స్టాప్ నుండి వారి చివరి గమ్యస్థానాలకు చేరవేస్తాయి.
హెచ్ఎంఆర్ఎల్ ఇప్పటికే మెట్రోరైడ్‌తో మొదటి..చివరి మైలు కనెక్టివిటీ భాగస్వామిగా సహకరించింది. మెట్రోరైడ్ ఎలక్ట్రిక్ ఆటో సేవలు ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ మరియు రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్నాయి. “తక్కువ నిరీక్షణ సమయంతో ఒక్కో రైడ్‌కు రూ. 10 నుండి టారిఫ్ ప్రారంభమవుతుంది. ఇది ప్రయాణికుల ప్రయాణఖర్చును మరింత తగ్గి హైదరాబాదీలకు ఊరట దక్కనుంది. ఇది సాకారమైతే హైదరాబాద్ వాణిజ్య ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు.