Homeఆంధ్రప్రదేశ్‌Modi - Pawan Kalyan Meet : మోడీతో మీటింగ్ రహస్యాలు బయటపెట్టని పవన్ కళ్యాణ్.....

Modi – Pawan Kalyan Meet : మోడీతో మీటింగ్ రహస్యాలు బయటపెట్టని పవన్ కళ్యాణ్.. ప్రత్యర్థులకు చమటలు

Pawan Kalyan Speech After Meeting With PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీని దాదాపు 8 ఏళ్ల తర్వాత కలిసిన పవన్ కళ్యాణ్ అరగంటకు పైగా ఒక్కడే చర్చలు జరిపారు. వెంట నాదెండ్ల మనోహర్ వచ్చినా ఆయనను లోపలికి పోనీయలేదు. మోడీ-పవన్ మాత్రమే ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారన్నది ఈ భేటి ముగిశాక పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకొని క్లుప్తసరిగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. మీటింగ్ లోని ఏ విషయాన్ని పవన్ బయటపెట్టలేదు. అది మోడీ ఆదేశాలా? లేక మీటింగ్ లో ఏవైనా సంచలనల విషయాలు చర్చించారా? లేదంటే ఈ మీటింగ్ అంత సవ్యంగా సాగలేదా? అన్నది ఏదీ తెలియడం లేదు. ఎందుకంటే పవన్ బయటపెట్టలేదు.

దాదాపు మోడీ ప్రధాని కాకముందు తొలి నాళ్లలో పొత్తు పెట్టుకున్నప్పుడు కలిశామని.. మళ్లీ ఇన్నాళ్లకు కలిశానని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 తర్వాత ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా కలవలేదని.. ఎన్నో సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని.. తాజాగా పీఎంవో రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేసి కలవాలని సూచించిందని.. అందుకే కలిశానని తెలిపారు.

మోడీతో కలవడం వెనుక ముఖ్య ఉద్దేశాన్ని పవన్ బయటపెట్టాడు. ‘ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలన్నది మోడీగారి ఉద్దేశం అని.. అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత చాలా బాగుండాలి. అలాగే ఏపీకి సంబంధించిన అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలు చెప్పాను. ఈ మీటింగ్ తో భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు వస్తాయని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీటింగ్ ఖచ్చితంగా తీసుకొస్తుందని గాఢంగా చెబుతున్నాను’’ అంటూ పవన్ ముక్తసరిగా ముగించారు.

పవన్ కళ్యాణ్ ముఖ కవళికలు చూస్తుంటే మీటింగ్ కు సంబంధించిన ఏ విషయాన్ని బయటపెట్టవద్దన్న ఆలోచనతో ఉన్నారు. అరగంటసేపు చర్చించిన విషయాలేవీ లీక్ చేయలేదు. ఏదైనా సీరియస్ మీటింగ్ అయినా జరిగి ఉండాలి. లేదంటే ఏం జరగకుండా అయినా ఉండాలి.

ప్రధానంగా పొత్తులపైనే ఈ భేటి జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఒకటి బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లడం.. లేదా బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి వెళ్లాలా? అన్న విషయంలో మోడీ కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇక పవన్ కు రూట్ మ్యాప్ కూడా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. మోడీ టూర్ ముగిసిన తర్వాత ఆలోచించుకొని పవన్ పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది.

ఇక ఈ భేటి ఫలవంతం కనుక కాక ఉంటే ఈ భేటి రహస్యాలు పవన్ చెప్పే అవకాశాలు లేకపోవచ్చు. అసలా మీటింగ్ లో ఏం జరిగిందన్నది పవన్ బయటకపెట్టకుండా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడమే ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version