Andhra Development : ఆంధ్రా ప్రజలకు కావాల్సిందేంటి? మీడియా, మేధావులు, రాజకీయ నాయకులు ఆంధ్రా ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏపీ ప్రజలకు విభజన హామీలు అమలు చేయలేని కేంద్రాన్ని నిందించడం కరెక్టే కానీ.. 2 లక్షల బడ్జెట్ ఉన్న ఏపీ ప్రభుత్వం ఆ డబ్బులతో ప్రజలకు న్యాయం చేస్తోందా? అన్నది ఇక్కడ ప్రశ్న. అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తేనే అభివృద్ధి చెందాయా?
ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. దీనికి కేంద్రం, రాష్ట్రం ఇద్దరి బాధ్యత ఉంది. స్పెషల్ కేటగిరీ ఏపీకి రాకపోవడం అన్యాయమే. ఏపీకి రాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవ్వమని చెప్పింది. ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేముందు దీనికంటే వెనుకబడిన 10 రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటాయి.
పోలవరం ఆలస్యం బాధ్యత కూడా కేంద్రం, రాష్ట్రాలు తీసుకోవాలి. రైల్వేజోన్ ను ఇవ్వకపోవడం కూడా కేంద్రం తప్పే. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం కేంద్రం తప్పే.
ఆవేశాలతో ఏపీ అట్టుడికింది.. సమైక్యాంధ్ర, స్పెషల్ స్టేటస్ అంటూ నష్టపోయింది. విశాఖ ఉక్కుపై పోరాడి ఫెయిల్ అవుతున్నారు. ఏపీ ప్రజలకు అసలు ఏం కావాలన్నది క్లారిటీ లేదు. రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్ ను సరిగ్గా వ్యయం చేసుకోకపోవడం పెద్దలోపంగా చెప్పొచ్చు. ఆంధ్రా ప్రజలకు అసలు కావాల్సింది ఏమిటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
