Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావాలి.. ఇది జనం నుంచి వ్యక్తమవుతున్న మాట.. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఇటీవల ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కే పట్టం కడుతారని.. ఏకపక్షంగా తీర్పునిస్తారని తేలింది.అది ఈరోజు పరిస్థితి.

అయితే ఏపీలో ఎన్నికలకు 2 సంవత్సరాల మూడు నెలల సమయం ఉంది. ఈ కాలంలో పవన్ జనంలోకి వెళితే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీపై ఏపీ ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. తెలుగు మీడియా అతిగా స్పందించడం కూడా వైసీపీకి లాభమైంది. నిజంగా మీడియాలో జగన్ తప్పు చేశాడని వచ్చినా.. ఆ మీడియా ఫేక్ అని.. అదంతా నమ్మవద్దని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆది నుంచి టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న మీడియా జగన్ పై అవాకులు చెవాకులు రాసింది. అయినా ప్రజలు పట్టించుకోవడం మానేసి వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించారు.
Also Read: బాక్సాఫీస్ వద్ద జీరో అయ్యాడు. ఓటీటీలోనైనా ‘హీరో’ అవుతాడా ?
రెండు సంవత్సరాల తర్వాత కూడా జగన్ కు ఈ ఊపు ఉంటుందని చెప్పలేం. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఎప్పుడైతే స్థానిక నాయకుల అహంతో ఉంటారో.. ప్రజలు బుద్ది చెబుతారు. కానీ ప్రజలకు ప్రత్యామ్మాయ రాజకీయ శక్తి అవసరం.. టీడీపీ మళ్లీ పుంజుకునే అవకాశాలు లేవు. ఉన్న వాళ్లల్లో మచ్చలేని పవన్ కళ్యాణ్ లాంటి వారు జనం మధ్యలోకి రావడం వల్ల జగన్ ను ఎదుర్కొనే శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.
పవన్ చెప్పిన సిద్ధాంతాలు నిజాయితీగా ఉన్నాయి. ప్రజలను కలుపుకుపోయే విధంగా ఉన్నాయి. అందుకే పవన్ కనుక ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగలరు. ఆ దిశగా కృషి చేయాలంటే పవన్ ఏం చేయాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] Also Read: పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావాలి […]