Pawan Kalyan – Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలు ఏ క్షణం లో అయినా వచ్చే అవకాశాలు మెండుగా ఉండడం వల్ల రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. తెలుగు దేశం – వైసీపీ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలు ప్రారంభించి జనాల్లోకి వెళ్లాయి. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేడు ‘వారాహి యాత్ర’ని ఘనంగా ప్రారంభించాడు.
యాత్ర ప్రారంభానికి ముందు రెండు రోజుల పాటు జనసేన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో యాగం నిర్వహించాడు. ఆ తర్వాత నేడు అన్నవరం దేవాలయాన్ని సందర్శించుకొని తన వారాహి వాహనంతో కాకినాడలోని పత్తిపాడు సభకి బయలుదేరాడు. ఈ సభకి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు , రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ స్పీచ్ లో ఆయన ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, ప్రమాణస్వీకారానికి రావాలని ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆయన ఫోన్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా సహృదయంతో శుభాకాంక్షలు తెలిపి, మేము చాలా బాధ్యత గల ప్రతిపక్ష నేతలుగా వ్యవహరిస్తాము. మీపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయం కానీ, పాలసీల పరంగా ఏదైనా తప్పు జరిగితే మాత్రం గొంతెత్తి మాట్లాడుతాము. మాకు ఆ అవకాశం కూడా రానివ్వకుండా పరిపాలన చేయండి, మీకు జనాలు 151 సీట్లు ఇచ్చారు’ అని చెప్పి శుభాకాంక్షలు తెలియచేసాను.
ఎప్పుడైతే నేను భావన నిర్మాణ కార్మికుల కోసం రోడ్డు మీదకి ఎక్కానో, అప్పటి నుండి నన్ను తిట్టడం ప్రారంభించారు. ఎంత నీచంగా తిట్టారంటే చివరికి చిన్న పసి బిడ్డలను కూడా వదలకుండా తిట్టించాడు ‘ అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి
Recommended Video: