
Pawan Kalyan – ABN RK : ఆ 1000 కోట్ల మరక అలాంటి ఇలాంటిది కాదు.. ఇదే వైసీపీ నేతలు చేసి ఉంటేనే ఇప్పటికే ‘ఇల్లు పీకి పందిరివేసేవాడు’ మన జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ కామెంట్ చేసింది తను పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న చంద్రబాబుకు అనుంగ మీడియా మిత్రుడు ఏబీఎన్ ఆర్కే. ఆ తర్వాత చంద్రబాబు హెచ్చరికలతో సారీ కూడా చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. అందుకే ఈ కాపు సమావేశంలో ఏబీఎన్ ఆర్కేకు పవన్ గట్టి కౌంటర్ ఇస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ ప్చ్.. కానీ సాధ్యపడలేదు. పవన్ సున్నితంగానే దీనికి సమాధానమిచ్చాడు. ఏబీఎన్ ఆర్కే పేరును ప్రస్తావించకుండా తన పార్టీ కోసం సొంత డబ్బులు పెడుతున్నానని.. 1000 కోట్లు పెట్టేంత లేదంటూ కవర్ చేశాడు. ఏబీఎన్ ఆర్కే చెంప పగిలేలా ఎంతో గట్టి కౌంటర్ ఆశించిన జనసైనికులకు ఆ రేంజ్ లో పవన్ ఇవ్వకపోయేసరికి కాస్త నిరుత్సాహ పడ్డారు.
బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ తన పార్టీ విస్తరణలో భాగంగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వెయ్యి కోట్ల ఆఫర్ తో కూడిన రాయబారాన్ని పంపించారు అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వారాంతంలో రాసే కొత్త పలుకులు కొద్దిరోజుల కిందట రాశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వేయి కోట్ల ఆఫర్ పై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వేయి కోట్ల రూపాయలతో రాజకీయాలు చేయలేమని, పార్టీని నడపలేమని, భావజాలం ఉంటేనే పార్టీని నడపగలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆర్కేకు కాస్త సుతిమెత్తగానే పవన్ కౌంటర్ ఇచ్చాడని అర్థమవుతోంది.
లోపాయికారీ ఒప్పందాలు లేవు..
రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు లేవని, ఆ తరహా ఒప్పందాలను పెట్టుకోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను నిర్మోహమాటంగానే ఉంటానని, మీ ఆత్మ గౌరవాన్ని తగ్గించనని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తా అని, జనసేన పార్టీని నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించబోనని పవన్ కళ్యాణ్ మరో మారు స్పష్టం చేశారు. ఇతర పార్టీల అజెండా కోసం తాము పని చేయమని, వేయి కోట్లతో రాజకీయాలు చేయలేమని, భావన బలం ఉంటేనే పార్టీని నడపగలమని, పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్య నడుపుతున్న అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపులంతా ఓట్లేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడినని, వాటర్ల వైవిధ్యమైన తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పదేళ్లుగా అనేక మాటలు పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. అవేమీ పడాల్సిన అవసరం లేదని, కానీ ప్రజల కోసం పడ్డానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు చాలా కీలకమని, సంఖ్యా బలాన్ని అనుసరించి మన చెత్త చాటుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సంఘాలను ఐక్యం చేసుకుంటే దక్షిణ భారతదేశంలోనే పెద్ద పాత్ర పోషించాగలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఇలా ఆంధ్రజ్యోతి ఆర్కేపై విరుచుకుపడుతాడని అందరూ భావించారు. కానీ పవన్ చాలా ప్రశాంతంగానే దీనికి కౌంటర్ ఇచ్చాడు. వైసీపీ బ్యాచ్ నుంచి ఈ విమర్శ వచ్చిఉంటే కథ వేరేలా ఉండేది. సొంత మిత్రపక్షం మీడియా కావాడంతోనే పవన్ కాస్త తగ్గాడని.. పొత్తుల వేళ అణుకువ ప్రదర్శించాడని అర్థమవుతోంది.