Janasena-BJP Merger: ఏపీ రాజకీయాల్లో పైకి పొత్తులు పెట్టుకున్న బీజేపీ, జనసేనలు లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ దసరా నుంచి ఒంటరిగా యాత్ర చేపట్టడానికి రెడీ అయ్యారు. ఇందులో బీజేపీని ఇన్ వాల్వ్ చేయడం లేదు. ఇక బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ను పక్కనపెట్టి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లతో భేటి అవుతున్నారు. ఇవన్నీ పరిణామాలు చేస్తుంటే బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పకతప్పదు.

జనసేన కోరుతోంది ఒక్కటే.. బీజేపీ -జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలనే. పవన్ సారథ్యంలో ముందుకెళ్లాలనే.. కానీ దానికి జేపీ నడ్డా కానీ.. జీవీఎల్ లాంటి వారు కానీ దాటవేస్తున్నారు. వారికి ఏపీలో జగన్ అవసరమో.. లేక చంద్రబాబు వద్దో తెలియదు కానీ.. పవన్ ను ముందు పెట్టడానికి తటపటాయిస్తున్నాయి. ఏపీలో భవిష్యత్ రాజకీయాల కోసం పవన్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించడం లేదు.
Also Read: Pawan Kalyan-Twitter: జగన్, చంద్రబాబులను మించిపోయిన పవన్ కళ్యాణ్.. అరుదైన రికార్డ్
అయితే పవన్ కళ్యాణ్ ను సీఎంగా ప్రకటించడానికి అభ్యంతరం లేదని.. కానీ ఆయన జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న కండీషన్ ను బీజేపీ పెద్దలు పెట్టారని అత్యంత సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల వేళ పవనే సీఎం అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. కానీ తర్వాత మాట మార్చేశారు.
పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి పెట్టిన ఏకైక షరతు ‘బీజేపీలో జనసేన విలీనం’ అని అంటున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోవడం లేదట.. ఇప్పటికే ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తప్పుపడుతున్నారు. పోరాటం చేయాలని.. రాజకీయాల్లో జనసేనతో తనది 25 ఏళ్ల పోరాటం అని ప్రకటించారు. రాజ్యాధికారం దక్కినా.. దక్కకున్నా ప్రజల్లోనే ఉంటానని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్తితుల్లోనూ తన పార్టీ జనసేనను బీజేపీలో విలీనం చేయనని ఖరాఖండీగా చెబుతున్నాడు. అందుకే బీజేపీకి దూరంగా ఒంటరిగా బలపడేందుకు ప్రజల్లోకి వెళుతున్నారు. జనసేన క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారు. ఇన్నాళ్లు బలం లేదనే జనసేనను విలీనం చేయాలని బీజేపీ అంటోందని.. అందుకే బలోపేతమై చూపిద్దామని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
బీజేపీ కోరిక.. పవన్ కళ్యాణ్ నిరాకరణ మధ్య ఈ రెండూ పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాయా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది. జనసేన విలీనం కోసమే నిజంగా బీజేపీ పట్టుబడితే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక పవన్ ను దూరం పెట్టడానికి ఇదే కారణమైతే బీజేపీ పెద్ద తప్పు చేస్తున్నట్టే. వీరి దారులు వేరుగా పడడం అంతిమంగా ఇద్దరికీ నష్టం. కలిసి ఉంటే కలదు సుఖం. కానీ కలవడానికి కమలనాథులు దూరం.. ఈ రాజకీయంలో పవన్ కళ్యాణ్ ఒంటరిపోరాటానికే బయలు దేరారు. మరి 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read:Operation Lotus: వికటిస్తున్నా ఆపరేషన్ లోటస్.. మూడు రాష్ట్రాల్లో బెడిసి కొట్టిన వ్యూహాలు!
[…] Also Read: Janasena-BJP Merger: పవన్ కల్యాన్ సీఎం: బీజేపీ.. జనస… […]
[…] Also Read: Janasena-BJP Merger: పవన్ కల్యాన్ సీఎం: బీజేపీ.. జనస… […]
[…] Also Read: Janasena-BJP Merger: పవన్ కల్యాన్ సీఎం: బీజేపీ.. జనస… […]