Pawan Kalyan: పాదయాత్ర.. తెలుగు రాజకీయాల్లో ఒక పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.

2014లో ఓడిపోయిన జగన్ అధికారం కోసం 2019 అసెంబ్లీ ఎన్నికల ముందుర చేసిన పాదయాత్ర ఆయనను విజయతీరాలకు చేర్చింది. ఏపీ చరిత్రలోనే అత్యధిక సీట్లు ఇప్పించి మరీ సీఎం సీట్లో కూర్చుండబెట్టింది. అదే అస్త్రంతో ఇప్పుడు జనసేన కూడా గద్దెనెక్కాలని చూస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అయితే పాదయాత్ర కంటే అన్న ఎన్టీఆర్ లా ‘చైతన్యరథం’తో ఏపీ అంతా తిరిగితే బెటర్ అని జనసేన ఆలోచిస్తున్నట్టు తెలిసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన పార్టీకి జవసత్త్వాలు నింపేందుకు.. ఏపీలో బలంగా నిలబడేందుకు.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు.. సీఎం క్యాండిడేట్ గా తెరపైకి రావడానికి పవన్ కళ్యాణ్ కు ఏదో ఒక యాత్ర అవసరం. ఇప్పుడే అదే ప్లాన్ లో ఉన్నారట జనసేన టీం.
జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ముందర ఏదో ఒక పెద్ద బ్రహ్మస్త్రం వదలబోతున్నారని అర్థమవుతోంది. నిన్న విశాఖలో పర్యటించిన నాగబాబు ఎన్నికల ముందర పవన్ కళ్యాణ్ ఏదో ఒక యాత్ర చేపడుతారంటూ హింట్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైంది.
టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా సత్తా చాటాలేకపోతోంది. చంద్రబాబుకు వయసు అయిపోవడంతో ఆయన మునుపటిలా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారు. వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ కోలుకోవడం లేదు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ వెళుతోంది. ఈ కూటమి తరుఫున పవన్ కళ్యాన్ ను సీఎం క్యాండిడేట్ గా ఇప్పటికే బీజేపీ ప్రొజెక్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక పవర్ ఫుల్ యాత్ర అవసరం ఎంతైనా ఉంది. అది రాష్ట్ర ప్రజలందరికీ పవన్ ను చేరువ చేయాలి. దీనికోసం అందరూ ‘పాదయాత్ర’ బెటర్ అని సూచిస్తున్నా.. అది పవన్ కళ్యాణ్ తో సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో రోడ్డు మీదకు వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఎంత మంది పోలీసులు ఉన్నా అది సాధ్యం కాదు. అందుకే అన్న సీనియర్ ఎన్టీఆర్ లా ఒక చైతన్య రథాన్ని తయారు చేసి రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేస్తే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.
2024లో గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లడం పవన్ కళ్యాణ్ కు కంపల్సరీ. అది నెరవేరాలంటే చివరి ఎన్నికల ఏడాది ఖచ్చితంగా బస్సు యాత్ర చేస్తే జనసేనకు ప్రయోజనంతోపాటు పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గానూ ప్రొజెక్ట్ కావచ్చు. అందరిలా పాదయాత్ర చేస్తే అంత సమయమూ లేదు.పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంతో కంట్రోల్ చేయడం సాధ్యమూ కాదు. అందుకే నాగబాబు ఏ యాత్ర చేస్తే మంచిదో ఆలోచిస్తున్నామని.. కానీ ఖచ్చితంగా యాత్ర ఉంటుందని హింట్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే పవన్ కళ్యాణ్ యాత్ర మరి ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచిచూడాలి.
Recommended Videos
[…] […]