Heroines Who Rejected NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఖ్యాతి పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు సాధారణంగా హీరోయిన్లు మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తీయబోయే త్రీడీ మూవీ కోసం హీరోయిన్లు దొరకడం లేదు. ఎవరిని సంప్రదించినా నో అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామందిని సంప్రదించినా ఎవరు కూడా ఓకే చెప్పడం లేదట. దీంతో హీరోయిన్ కొరత ఏర్పడింది. అంత పెద్ద స్టార్ తో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడుతున్నట్లో తెలియడం లేదు. కానీ మొత్తానికి హీరోయిన్ మాత్రం ఇప్పటివరకు ఫైనల్ కావడం తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమా కోసం మొదట ఆలియా భట్ ను సంప్రదించారు. కానీ ఆమె రణవీర్ కపూర్ తో వివాహం చేసుకోవడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో దీపికా పడుకునేను సంప్రదించినా ఆమె కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సమయంలోనే ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ బాగుందని కితాబిచ్చిన దీపిక ఈ సినిమాలో నటించేందుకు మాత్రం ఒప్పుకోలేదట. దీంతో చిత్ర యూనిట్ హీరోయిన్ వేటలో పడిపోయింది. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఓకే కాకపోవడం విచిత్రమే.

ఇక వరుస హిట్లతో ముందున్న రష్మిక మందనను కూడా అడిగారట. ఆమె కూడా తాను నటించలేనని చెప్పేసిందట. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ రష్మిక పలు సినిమాలు చేస్తోంది. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో తాను కూడా ఏం చేయలేనని చెప్పింది. దీంతో సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం అందరి గడపలు తొక్కుతోంది. ఎలాగైనా హీరోయిన్ ను పట్టుకోవాలని చిత్ర యూనిట్ తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీ దొరకకపోవడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: Nagababu: నాగబాబు పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు కారణాలేంటి?

సాహో సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ను కూడా అడిగారట. కానీ ఆమె కూడా ఒప్పుకోలేదు. సాహో నిరాశ పరచడంతో ఆమె మరో సినిమా చేయాలంటే ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. లోఫర్ చిత్రంతో అరంగేట్రం చేసిన మరో హీరోయిన్ దిశ పటాని కూడా ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు నో చెప్పడం గమనార్హం. కొద్ది రోజులుగా ఆమె బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తున్నా అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో ఆమెను మళ్లీ తెలుగులోకి తీసుకురావాలని కొరటాల శివ ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు.

మరోవైపు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధంగా ఉందనే పుకార్లు వచ్చినా ఆమె ఇంతవరకు తెలుగులోకి రాలేదు. విజయ్ దేవరకొండతో తెలుగులో అరంగేట్రం చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చినా ఇంతవరకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జాన్వీ కపూర్ ను కూడా సంప్రదించినా ఆమె కూడా స్పందించలేదని తెలుస్తోంది. ఇక చివరి అవకాశంగా అనన్యపాండేను అడిగేందుకు రెడీ అయినట్లు సమాచారం. మొత్తానికి స్టార్ హీరోకు కూడా హీరోయిన్ల కొరత రావడం నిజంగా దురదృష్టమో అదృష్టమో తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:Pranitha Baby Bump: ప్రణీత షాకింగ్ ఫొటోలు.. ఇలా చూపిస్తుందని అస్సలు ఊహించలేదు
Recommended Videos: