Lokesh – Pawan : జనసేన అధినేత పవన్ విశాఖ చేరుకున్నారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ సభ విజయనగరం జిల్లా పోలిపల్లిలో కొద్దిసేపటి కింద ప్రారంభమైంది. చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయినా.. ఆయన వస్తారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. నిన్నటి నుంచి పవన్ జ్వరంతో బాధపడుతూ ఉండడంతో.. సభకు గైర్హాజరవుతారని ప్రచారం జరిగింది. కేవలం చంద్రబాబు మాత్రమే హాజరు కావడంతో.. పవన్ విషయంలో సస్పెన్షన్ కొనసాగింది.
లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభకు వచ్చేందుకు తొలుత పవన్ విముక్తి చూపారు. లోకేష్ వ్యక్తిగత కార్యక్రమం కావడంతో వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నేరుగా వెళ్లి ఆహ్వానించడంతో వస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. అయితే సభ ప్రారంభమవుతుందని గా పవన్ హాజరు కావడం లేదన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో రకరకాల కథనాలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ తెరదించుతూ పవన్ సభకు హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విశాఖకు వచ్చారు.
నిన్నటి నుంచి పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేటి సభకు హాజరవుతారా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే పవన్ హాజరవుతారని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఇప్పుడు రారని తెలిస్తే తప్పుడు ప్రచారం జరుగుతుందని భావించి.. సభకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ పవన్ కు ఘనస్వాగతం లభించింది. కొద్దిసేపటి కిందే పవన్ రోడ్డు మార్గం గుండా విజయనగరం పోలిపల్లి సభా ప్రాంగణానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.