తల్లిదండ్రులను వదిలేసే పిల్లలకు అలర్ట్.. ఆస్తి వెనక్కు తీసుకునే ఛాన్స్..?

ఈ మధ్య కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులను వదిలేసి ఇబ్బందులకు గురి చేస్తున్న పిల్లల గురించి మనం వింటున్నాం. అయితే తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే అలాంటి పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిని పొందడానికి అర్హులు కాదు. ఒకవేళ పిల్లలకు తల్లిదండ్రులు అప్పటికే ఆస్తిని రాసిచ్చి ఉంటే ఆ ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్‌ సివిల్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్ చట్టంలో ఈ విధంగా […]

Written By: Navya, Updated On : February 13, 2021 6:12 pm
Follow us on

ఈ మధ్య కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులను వదిలేసి ఇబ్బందులకు గురి చేస్తున్న పిల్లల గురించి మనం వింటున్నాం. అయితే తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే అలాంటి పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిని పొందడానికి అర్హులు కాదు. ఒకవేళ పిల్లలకు తల్లిదండ్రులు అప్పటికే ఆస్తిని రాసిచ్చి ఉంటే ఆ ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్‌ సివిల్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్ చట్టంలో ఈ విధంగా నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లలకు మూడునెలల జైలు శిక్ష, జరిమానా కూడా కోర్టు విధించే అవకాశాలు ఉంటాయని మురళీమోహన్ తెలిపారు. తల్లిదండ్రుల ఆస్తిని కాజేసి నిర్లక్ష్యం చేస్తే మాత్రం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులను వదిలేసి నిరాశ్రయులను చేయడం తీవ్రమైన నేరం అని మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో వాకర్స్‌ క్లబ్‌ సహకారంతో జరిగిన సదస్సుకు హాజరైన మురళీమోహన్ ఈ విషయాలను వెల్లడించారు. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మురళీమోహన్ వెల్లడించారు. పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ పోషణ, సంక్షేమ చట్టం గురించి మురళీమోహన్ వివరించారు.

ఎవరైనా తల్లిదండ్రులు నిరాదరణకు గురైతే ఆర్‌డీఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్‌ను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. తల్లిదండ్రులకు పిల్లలు నిర్లక్ష్యం చేస్తే ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెహ్పవచ్చు.