https://oktelugu.com/

Annamalai’s DMK files : లిక్కర్ చుట్టూనే తమిళనాడు రాజకీయాలు

అవినీతి, లిక్కర్ స్కాంలో ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం కూరుకుపోయింది. లిక్కర్ చుట్టూనే తమిళనాడు రాజకీయాలు సాగుతున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2023 / 11:41 PM IST
    Follow us on

    Annamalai’s DMK files : తమిళనాడు రాజకీయాలన్నీ ‘లిక్కర్’ చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ తమిళ అధ్యక్షుడు అన్నామలై ఎజెండా సెట్ చేశాడు. అన్నాడీఎంకే ఫళని స్వామి దీన్ని ఫాలో అవుతున్నాడు. అసలేంటి ఇదీ.. తమిళనాడులో లిక్కర్ షాపులన్నీ కూడా ప్రభుత్వమే నడుపుతోంది. ప్రభుత్వమే ఓకార్పొరేషన్ ఏర్పాటు చేసి నడిపిస్తుంది. ఇటీవల కల్తీ సారా తాగి 20 మంది చనిపోయారు. వరుసగా ఘటనలు చోటుచేసుకున్నాయి. లిక్కర్ సెనైడ్ కలిసి చనిపోయిందని అంటున్నారు. లిక్కర్ సీసాలో బల్లి వచ్చిందని.. ఆ బార్ పరిశ్రమలశాఖ మంత్రి టీఆర్ బాలుకు చెందిందని అంటున్నారు.

    తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై డిఎంకె, అన్నా డీఎంకే పార్టీలలో అవినీతిపరులైన నాయకుల ఆస్తులను, సంపాదనను వరుసగా బయటకి చెప్తున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా ఇవి సంచలనం రేకెత్తిస్తున్నాయి. అన్నామలైకి ముకుతాడు వేసేందుకు డీఎంకే ఈ ఏకంగా 500 కోట్లకి పరువు నష్టం దావా కూడా వేసినట్టు వార్తలు వస్తున్నాయి.. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపించేది కేవలం ఒక ఏడాదిలో స్టాలిన్ అల్లుడు శబరీశన్, కొడుకు ఉదయనిధి 30 వేల కోట్లు సంపాదించారట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పి.టి.ఆర్ త్యాగరాజన్. ఈ సంపాదన గురించి ఎవరితోనో మాట్లాడుతుండగా ఆ వాయిస్ రికార్డ్ అయింది. అది కాస్తా అన్నామలై దగ్గరకు వచ్చింది. దీంతో అతడు డిఎంకె ఫైల్స్ పేరుతో ఆ ఆడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

    ఇలా అవినీతి, లిక్కర్ స్కాంలో ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం కూరుకుపోయింది. లిక్కర్ చుట్టూనే తమిళనాడు రాజకీయాలు సాగుతున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.