G20 Meeting -Kashmir : కాశ్మీర్ లో G-20 సమావేశాలు జరగకుండా పాకిస్తాన్ కుట్రలు

జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం

Written By: NARESH, Updated On : May 9, 2023 10:06 pm
Follow us on

G20 Meeting -Kashmir : ఇప్పటికే కాశ్మీర్ కు సంబంధించిన స్వయం ప్రతిపత్తి హోదాను రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి పక్కలో బల్లెంలా మారి ఇబ్బంది పెడుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. కాశ్మీర్ మాదే అని పాకిస్తాన్ తన భౌగోళిక చిత్రపటంలో రూపొందించడం, చైనా కూడా దీనికి వంత పాడుతుండడంతో ఇన్నాళ్ళూ ఓపికతో ఉన్న మోదీ ఇప్పుడు తనలో ఉన్న అసలు సిసలైన డిప్లమాటిక్ పర్సనాలిటీని వారికి పరిచయం చేస్తున్నారు.

జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని లడక్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ము కాశ్మీర్ ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి.

భారతదేశంలో తొలిసారిగా 2023లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశాలను నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ నుంచి ఇద్దరు నోడల్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం గమనార్హం.

కాశ్మీర్ లో G-20 సమావేశాలు జరగకుండా పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.