
అంతర్జాతీయ శాంతి కోసం రెండు ప్రముఖ దేశాలు నడుం బిగించాయి. శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ అమెరికా, రష్యాలు కోరుకుంటున్నాయి. పాక్ కు చైనా సాయమందిస్తున్న తరుణంలో చైనాను కట్టడి చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్యాల మధ్య శాంతి చర్చలకు స్విట్జర్లాండ్ లోని జెనీవా వేదికైంది. జెనీవా సదస్సు లేదా జెనీవా కన్వెన్షన్ గా పిలుస్తోన్న ఈ ఘట్టంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మఖాముఖి చర్చలు జరిపారు. రెండు దేశాల సంబంధాలపై సుదీర్ఘంగా ఐదు గంటల పాటు వీరు లోతుగా చర్చలు జరిపారు. పలు అంతర్జాతీయ అంశాలతోపాటు చైనాను కట్టడి చేసే అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
రష్యా అధినేత హోదాలో పుతిన్ ఇప్పటికి ఆరుగురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడయ్యా జో బైడెన్ తొలిసారిగా పుతిన్ తో సమావేశమయ్యారు. అమెరికా, రష్యా దేశాల మధ్య సంబంధాలు దిగజారాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ కావడం, కరోనా పరిస్థితులు, చైనా కట్టడి అంశాల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
జెనీవా సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గయ్ పర్మెలిన్ ఇరు దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత విల్లా ముందు నిలబడి బైడెన్, పుతిన్ లు కరచాలనం చేస్తూ మీడియా ముందు పోజులిచ్చి అనంతరం లోనికి వెళ్లి చర్చలు జరిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు తొలిదశలో ప్రస్తావనక వచ్చిన ప్రాథమిక అంశాలపై ఇరు దేశాలూ ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో కొద్ది నిమిషాల గ్యాప్ ఇచ్చి రెండో దశలో లోతైన చర్చలకు దిగారు.
బైడెన్ తోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, ఎన్ఎస్ఏ జేక్ మలివాన్, రష్యాలో అమెరికా రాయబారి జాన్ సులివాన్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. రష్యా తరపున పుతిన్ తోపాటు విదేశాంగ మంత్రి నర్లే లావ్రోవ్, విదేశీ వ్యవహారాల్లో పుతిన్ సలహాదారు యూరి ఉషాకోవ్ తదితరులు ఉన్నారు.
రెండు రోజుల క్రితం బ్రస్సెల్ లో నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, రష్యా అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. కరోనా విలయంలో ప్రపంచ ముఖచిత్రంలో మార్పులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న చైనాపై పోరులో కలిసి రావాలని అమెరికా రష్యాను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.