Latest OTT Releases : ఈ వారం ఓటిటి లో రిలీజ్ అవుతున్న 29 సినిమాలు ఇవే…

ఈ వారం ఈ సినిమాలు వస్తే నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది...ఈ ఓటిటి వల్ల సినిమా లవర్స్ కి ఎక్కడలేని ఎంటర్ టైన్ మెంట్ దొరికుతుంది అనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 2, 2023 4:16 pm

Miss Shetty Mr Polishetty Collections

Follow us on

Latest OTT Releases : ఈ రోజుల్లో ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయిన కూడా అది థియేటర్ లో చాలా తక్కువ రోజులు మాత్రమే నడుస్తుంది.ఇక ఎంత నడిచిన కూడా మహ అయితే నెల రోజులు నడవడం చాలా ఎక్కువ అనే చెప్పాలి…ఇక ఇలాంటి క్రమం లోనే ఓటిటి లోకి సినిమా లు వచ్చి అక్కడ కూడా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఓటిటి ల్లో సస్పెన్స్ కి సంభందించిన సినిమాలు ఎక్కువ గా ఆడుతున్నాయి. ఎందుకంటే అలాంటి సినిమాలకి ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది.అందుకే చాలా సినిమాలు, సీరీస్ లు ఇప్పుడున్న జనరేషన్ మేకర్స్ కూడా థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఓటిటి ప్రేక్షకులు కూడా అవే కోరుకుంటున్నారు కాబట్టి వాటికి సంభందించినవే ఇక్కడ ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి… అయితే ప్రతి వారం చాలా సినిమాలు ఓటిటి లోకి వచ్చి సందడి చేస్తూ ఉంటాయి అలాగే ఈ వారం కూడా 29 సినిమాలు ఓటిటి లోకి వచ్చి సందడి చేస్తున్నాయి అవి ఏం సినిమాలు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

హాట్ స్టార్
ముందు గా హాట్ స్టార్ గురించి చూసుకుంటే…హాట్ స్టార్ లో ఈ వారం భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి…

ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2 అక్టోబరు 6 వ తేదీన హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది…

ఇక దీనితో పాటు గా  హాంటెడ్ మ‍్యాన్షన్ ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబరు 4న స్ట్రీమింగ్ కానున్నాయి…
ఈ రెండు కూడా ఓటిటి లో ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతాయి అనేది చూడాలి…

అమెజాన్ ప్రైమ్
ఇక తెలుగు కి సంబంధించిన ఎక్కువ సినిమాలు అవలేబుల్ లో ఉండే ఓటిటి ప్లాట్ ఫాం గా గుర్తింపు పొందిన అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ వారం సినిమాలు చాలానే వస్తున్నాయి అవేంటి అంటే

ముంబయి డైరీస్ సీజన్ 2.. హిందీ సిరీస్.. అక్టోబరు 6 న స్ట్రీమింగ్ కాబోతుంది…

అలాగే దీనితో పాటు గా  టోటల్లీ కిల్లర్.. అక్టోబరు 6 న ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది… డీస్పరెంట్ సీకింగ్ సోల్‌మేట్ అనే ఇంగ్లీష్ సిరీస్ కూడా 6 వ తేదీన ఓటిటి లోకి వస్తుంది… ఇక ప్రైమ్ నుంచి వచ్చే వాటిలో ఎది ఎక్కువ ఆదరణ పొందుతోందో చూడాలి…

జీ5..
ఇక ఈ మధ్య కాలం లో జీ 5 లో మంచి కాన్సెప్ట్ లతో సీరీస్ లు వస్తున్నాయి అని ప్రేక్షకుల నుంచి కూడా జీ 5 మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఈ వారం కూడా
గదర్ 2 హిందీ వెర్షన్ అక్టోబర్ 6 వ తేదినుంచి మనకు అవలేబుల్ లో ఉంటుంది…

సినీ బజార్ ,  నీ వెంటే నేను తెలుగు వెర్షన్ అక్టోబర్ 6 న వస్తుంది…

జియో
ప్రస్తుతం ఎక్కువ గా హిందీ ప్రాజెక్ట్ లు జియో ప్లాట్ ఫాం నుంచి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.ప్రస్తుతం ఈ వారం కూడా అలాగే మొయిన్ మహ్మమూద్ హిందీ వెర్షన్ అక్టోబర్ 3 నుంచి అందుబాటులో ఉంటుంది…

ర్యాట్ ఇన్ ద కిచెన్..హిందీ షార్ట్ ఫిల్మ్ అక్టోబరు 2 న వస్తుంది. గుస్పైత్ బిట్వీన్ బోర్డర్స్.. అనే ఒక హిందీ షార్ట్ ఫిల్మ్స్ అక్టోబరు 6 న ఓటిటి లోకి వస్తుంది…

ద డాటర్.హిందీ షార్ట్ ఫిల్మ్ కూడా అక్టోబరు 7 న స్ట్రీమింగ్ కానుంది…

ఇక జియో లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి నచ్చితే అది షార్ట్ ఫిల్మ్ అయిన కూడ దాన్ని కొని రిలీజ్ చేస్తారు…

నెట్‌ఫ్లిక్స్..
ప్రస్తుతం ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్ లో అన్నిటికంటే పెద్ద సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం సినిమా రిలీజ్ దాకా ఆగకుండా సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమా రైట్స్ ని కొనుగోలు చేస్తుంది అందులో భాగంగానే రీసెంట్ గా ఎన్టీయార్ కొరటాల శివ కాంబో లో వస్తున్న దేవర సినిమాని కూడా 90 కోట్లు పెట్టీ కొన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ వారం ఇందులో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఇవే…

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరి కాంబో లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ అక్టోబర్ 5 వ తేదీన ఓటిటి లో అందుబాటు లో ఉంటుంది…

ఖుఫియా.. హిందీ.. అక్టోబర్ 5
ఇన్సీడియష్ ద రెడ్ డోర్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 6
బెక్‌హమ్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. అక్టోబర్ 4.

రేస్ టూ ద సమ్మిట్ అనే జర్మన్ సినిమా అక్టోబర్ 4 నా స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా ని సినిమా లవర్స్ సినిమా మేకర్స్ అందరూ చూడండి. ఎందుకంటే ఈ సినిమా లో ఒక సోల్ అనేది అద్బుతం గా ఉంటుంది.ఆ కాన్సెప్ట్ కూడా మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది…

ఎవ్రిథింగ్ నౌ ఇంగ్లీష్ లో అక్టోబర్ 5 న అందుబాటు లో ఉంటుంది…

లూపిన్ పార్ట్ 3 అక్టోబర్ 5 న ఇంగ్లీష్ లో అందుబాటు లో ఉంటుంది..

ఏ డెడ్లీ ఇన్విటేషన్ అనే స్పానిష్ మూవీ అక్టోబర్ 6 న అందుబాటులో ఉండనుంది…

బల్లేరినా అనే కొరియన్ మూవీ కూడా అక్టోబర్ 6 నా స్ట్రీమింగ్ అవుతున్నాయి…

స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ అనే కొరియన్ సినిమాలు అక్టోబర్ 7 న అందుబాటులో ఉంటుంది…

సిస్టర్ డెత్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5 న స్ట్రీమింగ్ కానుంది…

డిస్కవరీ ప్లస్..
స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్.. హిందీ అక్టోబర్ 6 న స్ట్రిమింగ్ కానుంది..

బుక్ మై షో..
ఇందులో ముఖ్యంగా కొత్తదనం ఉన్న సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి…

ఆస్టరాయిడ్ సిటీ అక్టోబరు 06 న అందుబాటు లో ఉంది…

ద నన్ 2.. ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబరు 03

గ్రాన్ టరిష్మో.. ఇంగ్లీష్ మూవీ.. అక్టోబరు 05 స్ట్రీమింగ్ అవుతుంది…

ఈ వారం ఈ సినిమాలు వస్తే నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది…ఈ ఓటిటి వల్ల సినిమా లవర్స్ కి ఎక్కడలేని ఎంటర్ టైన్ మెంట్ దొరికుతుంది అనే చెప్పాలి…