https://oktelugu.com/

Operation Valentine : ఆపరేషన్ వాలెంటైన్ ట్విట్టర్ టాక్ : మెగా హీరో మూవీకి ఊహించని రెస్పాన్స్, హిట్ పడిందా?

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఆసక్తికరంగా కథనం నడపడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. కథలో ఎమోషనల్ కనెక్టివిటీ తగ్గింది అనేది కొందరి ఆడియన్స్ అభిప్రాయం. ఇక ఆపరేషన్ వాలెంటైన్ రిజల్ట్ తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి...

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 9:14 am
    Follow us on

    Operation Valentine : మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. కంచె, అంతరిక్షం వరుణ్ చేసిన అరుదైన చిత్రాలు అని చెప్పొచ్చు. ఈసారి ఆయన పాట్రియాటిక్ వార్ డ్రామా ఎంచుకున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రోల్ చేశాడు. ఈ సబ్జెక్టు తో తెరకెక్కిన ఫస్ట్ టాలీవుడ్ మూవీగా ఆపరేషన్ వాలెంటైన్ నిలుస్తుంది. మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్ గ్రాండ్ గా విడుదల చేశారు.

    ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ ప్రీమియర్స్ ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ స్పందన ఏంటో చూద్దాం. ఆపరేషన్ వాలెంటైన్ కథ విషయానికి వస్తే… అర్జున్ రుద్ర దేవ్(వరుణ్ తేజ్) భారత వైమానిక దళంలో వింగ్ కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అర్జున్ ఒక రూత్ లెస్ వింగ్ కమాండర్. అత్యంత దేశభక్తి కలిగిన అధికారి. ఈ క్రమంలో ఆయన కొన్ని సాహసోపేత ఆపరేషన్స్ చేస్తాడు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు విడుస్తారు.

    దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై ఇండియన్ నేవీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి అనుకుంటుంది. ఈ ఆపరేషన్ కి హెడ్ గా అర్జున్ ఉంటాడు. మరి ఈ దాడిలో అర్జున్ టీమ్ సక్సెస్ అయ్యిందా? దాడి అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటీ? అనేది అసలు కథ. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ యాక్షన్ మూవీ లవర్స్ కి ఫీస్ట్. ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరుస్తాయి. విజువల్స్ కట్టిపడేశాయి. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేపుతాయని అంటున్నారు.

    నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక వింగ్ కమాండర్ పాత్రకు వరుణ్ తేజ్ చక్కగా కుదిరాడు. వరుణ్ తేజ్ నటన బాగుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే రాడార్ కమాండర్ రోల్ చేసిన మానుషీ చిల్లర్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె హావభావాలు సహజంగా ఉన్నాయని అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అందించిన బీజీఎమ్ మెప్పించింది. మొత్తంగా వార్ డ్రామాలు ఇష్టపడేవారికి ఆపరేషన్ వాలెంటైన్ ఫీస్ట్ అంటున్నారు.

    దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఆసక్తికరంగా కథనం నడపడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. కథలో ఎమోషనల్ కనెక్టివిటీ తగ్గింది అనేది కొందరి ఆడియన్స్ అభిప్రాయం. ఇక ఆపరేషన్ వాలెంటైన్ రిజల్ట్ తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి…