https://oktelugu.com/

Congress : మరోసారి హిందూ వ్యతిరేక ముద్ర వేసుకున్న కాంగ్రెస్

మరోసారి హిందూ వ్యతిరేక ముద్ర వేసుకున్న కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2024 / 04:16 PM IST

    Congress : జనవరి 22 అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట.. దేశం మొత్తం మీద కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఇది జరుగుతుందని ఎవరూ కూడా కలలో కూడా ఊహించలేదు. హిందువులు కూడా ఇది జరుగుతుందని భావించలేదు. మథనపడ్డారు. మాకు ‘రాముడు’ అత్యంత ప్రీతిపాత్రుడు అన్న వారికి.. రామాలయం తీసేసి మసీదు కట్టారన్న భావన హిందువులను బాగా కలిచివేసింది.

    జెరూసలెంలో యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉంటారు. హిందువులకు ప్రధాన కార్యస్థలం అయిన అయోధ్యలో రాముడికి గుడి లేదన్న భావన చాలా బలంగా ఉంది. నెరవేరలేదు అని చాలా మంది అనుకున్నారు. ఆ కల నెరవేరింది. జనవరి 22కి రాముడు పుట్టిన చోటకు రావడం అనేది హిందువులకు గొప్ప పండుగలాగా మారింది.

    ఇంతటి మహత్తర ఘటన జరుగుతుంటే.. 75 శాతం మంది హిందువులు ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటే.. ఏ రాజకీయ పార్టీ అయినా.. ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉంటే.. వాళ్ల హృదయాలు గెలుచుకోవాలని అనుకుంటాయి. కానీ కాంగ్రెస్ కు ఈ విషయం తెలియదా? అయోధ్యను పట్టించుకోదా? ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం అని కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి.

    మరోసారి హిందూ వ్యతిరేక ముద్ర వేసుకున్న కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.