CM KCR: టైం నువ్వు చెప్పినా సరే.. నేను చెప్పినా సరే.. ప్లేసు నువ్వు చెప్పినా ఓకే.. నే చెప్పినా ఓకే.. ఎనీ టైం.. ఎన్నికలకు సై అంటూ ప్రధాని మోడీకి సవాల్ చేశారు సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వస్తే.. తాను కూడా అసెంబ్లీ రద్దు చేస్తానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.

తేదీ ఖరారు చేస్తే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు కెళతామని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో దించినట్టు తెలంగాణలో ఏక్ నాథ్ శిండేలను పుట్టిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎందరు ఏక్ నాథ్ లు వచ్చినా మేమే గెలుస్తామని.. ప్రజలకు మంచి చేసిన తమను వాళ్లే గెలిపిస్తారని స్పష్టం చేశారు.
దేశంలో కొత్త పార్టీ వద్దా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.కాశీ గోపురం వర్షాలకు కూలడం అరిష్టమని.. మోడీతోనే దేశానికి నాశనమన్నారు. రూ.400 ఉన్న గ్యాస్ 1100 చేశాడని.. ఈయన పాలనలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు.
శ్రీలంకలో తన స్నేహితుడికి కాంట్రాక్టులు ఇప్పించాడని.. ఆయన అవినీతిపై మాట్లాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. దేశంలో 38 శాతం పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవమన్నారు. మోడీ మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు. సైన్యానికి వదలకుండా గందరగోళం చేస్తున్నాడని..130 కోట్ల మందిని ఇష్టమొచ్చినట్టు పాలించడం కరెక్ట్ కాదన్నారు. యువతను పక్కదారి పట్టిస్తున్నాడన్నారు.
కేసీఆర్ తెలంగాణలో వర్షాలపై హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రతి మంత్రిని హెడ్ క్వార్టర్ లో ఉండి పర్యవేక్షించాలని.. కలెక్టర్లు,అధికారులు అలెర్ట్ గా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మోడీ కనుక ముందుకొస్తే ముందస్తు ఎన్నికలకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. మోడీతో నేరుగా ఢీకొంటానని సవాల్ చేశారు. మరి బీజేపీ దీనికి సిద్ధమవుతుందా? అంటే ఇప్పట్లో కష్టమే.. ఇటీవల తెలంగాణకు వచ్చినా మోడీ అసలు కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ సవాల్ కు బీజేపీ స్పందించకపోవచ్చు.
[…] […]